ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ సీడ్ బాంబ్ ఎఫెక్ట్: Swetcha Seed Bomb: అధికారులు, మావేశాలు, సమీక్షలు, పంట క్షేత్రాల పరిశీలన, రైతులు సేద్యం చేసిన తీరు పై ఆరా తీస్తున్నారు. కంపెనీ మేనేజర్లు ఆర్గనైజర్ల సమావేశానికి జిల్లా కలెక్టర్ రైతులను కూడా ఆహ్వానించాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో రైతులు బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల బాండ్ వ్యవసాయంపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించి రైతులు మొక్కజొన్న పంట ఎలా నష్టపోయారో ఆరా తీశారు. ఆ సమయంలో ఆర్గనైజర్లతో పాటు రైతులతోనూ సమావేశం నిర్వహిస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని రైతులు వెల్లడిస్తున్నారు. బాండ్ ఒప్పందాలపై పారదర్శక సమావేశం నిర్వహించాలని మొదటి నుండి అధికారులను రైతులు కోరుతూనే ఉన్నారు.
మేనేజర్లు ఆర్గనైజర్లు ఇచ్చే రాంగ్ ఫీడింగ్ ను అధికారులు పరిగణలోకి తీసుకోవద్దని రైతుల విజ్ఞప్తి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మేనేజర్లు, ఆర్గనైజర్లు ఇచ్చే రాంగ్ ఫీడింగ్ ను అధికారులు పరిగణలోకి తీసుకోవద్దని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు. బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల మేనేజర్లు, ఆర్గనైజర్లు, అధికారులతో పాటు రైతులను కూడా సమావేశాలకు ఆహ్వానిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. మేనేజర్లు, ఆర్గనైజర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తే రైతులకు తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఉంటుందని ఆదివాసి నాయకులు వెల్లడిస్తున్నారు.
రాష్ట్రం, జిల్లాలో విత్తన బ్రాంచ్ రిజిస్ట్రేషన్ లేకుండా రైతులకు ఎలా సరఫరా చేస్తారు…?
రాష్ట్రం, జిల్లాలో బహుళ జాతి మొక్కజొన్న ఇంటర్నేషనల్ విత్తన కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా రైతులకు విత్తనాలను ఎలా సరఫరా చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. మిర్చి, పత్తి విత్తనాలు విక్రయాలు జరిపే కంపెనీలు తమ బ్రాండ్ పేరును ప్యాకింగ్ పై ముద్రించి రైతులకు విత్తనాలను అమ్ముతారు. విత్తన అభివృద్ధి సంస్థల నిబంధనల మేరకు రాష్ట్రంలో, లేదంటే జిల్లాలో తమ కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ నిబంధనలను బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా రైతులకు విత్తనాలను అంటగడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సింది పోయి, సమావేశాలకు ఆహ్వానించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్గనైజర్లు మేనేజర్లతో నిర్వహించే సమావేశానికి రైతులకు ఇంటిమేషన్ అధికారులు ఎందుకు ఇవ్వడం లేదు అర్థం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ముందే సమావేశం నిర్వహించి ధరను నిర్ణయిస్తే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అసలు జిల్లాలో ఏం జరుగుతుందో అధికారులకు అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల కోట్ల ఆదాయం ఉన్న మల్టీ నేషనల్ బహుళ జాతి విత్తన కంపెనీలు బ్రాండ్ పేరు లేకుండా ఎలా సరఫరా చేస్తున్నారని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి గందరగోళ వ్యవస్థ కొనసాగుతుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పట్టించుకోని రైతులకు మేలు చేయాల్సి ఉందన్నారు.
Also Read: Warangal News: ములుగు డిఎస్పీ సీరియస్ వార్నింగ్.. ఇలా చేస్తే కటకటాలే..
న్యాయవ్యవస్థకు సైతం దొరకకుండా వ్యాపారం ఎందుకు చేస్తున్నారు అధికారులు తీర్చలేక పోతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కంపెనీ పేరు లేకుండా చాకచక్యంగా వ్యవహరిస్తూ జాగ్రత్త తో కంపెనీలు బహుళజాతి విత్తనాలను రైతులకు సరఫరా చేసి సేద్యం చేయిస్తున్నారని చెబుతున్నారు. బహుళ జాతి విత్తన కంపెనీలు ఇలా చేస్తున్నారంటే ఫ్రాడ్ చేస్తున్నట్లేనని అధికారులు అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ క్ కంపెనీలో ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఒకరు బీటీ విత్తనాలు కాకుండా ఎట్లుంటాయ్…? అవి ఖచ్చితంగా బీటీ విత్తనాలు మాట్లాడినట్లు సమాచారం.
గత ఐదు సంవత్సరాల క్రితం కంపెనీలో పని చేసిన ఆర్గనైజర్ సైతం జన్యు మార్పిడి డెవలప్మెంట్ ద్వారా చేసిన విత్తనాలు లేనని కూడా చెప్పినట్లు టాక్. మొత్తానికి జన్యు మార్పిడి అని తెలిస్తే చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెబుతున్నారు. ఇప్పటికే వాజేడు వెంకటాపురం మండలాల్లో వాతావరణం లో పెను మార్పులు సంభవించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యం లోను మార్పులు సైతం తలెత్తుతున్నట్లు రైతులు గమనించామని వెల్లడిస్తున్నారు. ఆహార పంటల ఉత్పత్తుల్లో జన్యు మార్పిడి విత్తనాలను ఎలా సరఫరా చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఏదో ప్రయోగాలు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోప భూయిష్టం, పారదర్శకత లేని సమావేశం
బహుళ జాతి విత్తన కంపెనీల మేనేజర్లు, ఆర్గనైజర్లతో సమావేశాలు నిర్వహిస్తే లోప భూయిష్టం, పారదర్శకత లేని సమావేశం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఇచ్చిన సీడ్స్ ను ఆర్గనైజర్లు కల్తీ చేస్తున్నారా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. అటు కంపెనీల ద్వారా రైతులు పంట నష్టపోయారని వారి దగ్గర నష్టపరిహారం వసూలు చేయడం…ఇటు రైతుల నుండి కంపెనీ వాళ్లు రాయించుకున్న ప్రాంసరీ నోటు అప్పులను వసూలు చేయడం జరుగుతుందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. నష్టపరిహారం ఒక్కో ఎకరానికి రూ.లక్ష అనుకుంటే పదివేల ఎకరాలకు రూ. 10 కోట్లు అవుతాయి. ఇవన్నీ అటు కంపెనీకి తెలియకుండా, ఇటు రైతులకు పరిహారం ఇవ్వాలని కంపెనీల ద్వారా వసూలు చేసి డబ్బులను మూటకట్టుకుంటున్నారా..? అని సందేహాలు సైతం ఉత్పన్నమవుతున్నాయి.
జిల్లా కలెక్టర్ మాతో మాట్లాడాలి… రైతుల డిమాండ్
సోమవారం ములుగు కలెక్టర్ కార్యాలయంలో బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల మేనేజర్లు, ఆర్గనైజర్లతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మేనేజర్లు, ఆర్గనైజర్లతో పాటు రైతులను సైతం సమావేశానికి ఆహ్వానిస్తే రైతులకు మేలు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. మేనేజర్లు, ఆర్గనైజర్లు, రైతులు లేకుండా సమావేశం నిర్వహించడం సరైనది కాదని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వేలకోట్ల టర్నోవర్ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీలు బట్ట సంచుల్లో విత్తనాలను సరఫరా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాలను కంపెనీలే సరఫరా చేస్తున్నాయా…? లేదంటే కంపెనీలు జెన్యూన్ విత్తనాలు అందిస్తే ఆర్గనైజర్లు, మేనేజర్లు కల్తీ చేసి రైతులకు అంటగట్టి రూ. కోట్లను ఆదాయం పొందుతున్నారా…? అనే మరో ప్రశ్న కూడా రైతుల మెదళ్లను తోలుస్తుంది. ఒకటి జన్యు మార్పిడి డెవలప్మెంట్ ద్వారా వచ్చిన విత్తనాలను బ్రాండ్ పేరు లేకుండా బట్ట సంచుల్లో రైతులకు పంపిణీ చేస్తున్నారా…? లేదంటే… రెండు ఆర్గనైజ్ అలీ కంపెనీలు తయారు చేసిన విత్తనాలను కల్తీ చేసి ఫేక్ విత్తనాలను అంటగడుతున్నారా..? అనేది అధికారులు తేల్చాల్సి ఉందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు