Hyderabad Crime (image credit:Canva)
క్రైమ్

Hyderabad Crime: మాయగాడు.. మోసగాడు.. పెళ్లి పేరుతో పెద్ద కథే నడిపాడు.. చివరికి?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Hyderabad Crime: పెళ్లి పేరు మహిళలను వరుసగా మోసగిస్తూ లక్షల రూపాయలు దండుకున్న మోస్ట్​ వాంటెడ్​ ఫ్రాడ్​ స్టర్​ ను జూబ్లీహిల్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి మొబైల్​ ఫోన్లతోపాటు బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్​ చేశారు. జూబ్లీహిల్స్​ ఏసీపీ వెంకటగిరి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ మహిళా డాక్టర్​ పెళ్లి చేసుకోవాలని సరైన జోడి కోసం వెతుకుతూ జోగాడ వంశీ కృష్ణ ఓ వెబ్​ సైట్​ లో అప్​ లోడ్​ చేసిన ప్రొఫైల్​ చూసింది.

అందులో వంశీ కృష్ణ ఎన్నారైనని పేర్కొనటంతో అతన్ని సంప్రదించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవటానికి తాను సిద్ధం అని చెప్పిన వంశీ కృష్ణ వ్యాపార అవసరాల కోసం అత్యవసరంగా 11 లక్షల రూపాయలు కావాలని ఆమెను అడిగాడు. దీనిని నమ్మిన వైద్యురాలు అతను చెప్పిన ఖాతాల్లోకి 10.94 లక్షల రూపాయలను ట్రాన్స్​ ఫర్ చేసింది. ఆ తరువాత వంశీ కృష్ణ మోసం చేసినట్టు గ్రహించింది. ఈ మేరకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వంశీ కృష్ణను అరెస్ట్​ చేశారు.

20కి పైగా కేసుల్లో…
విచారణలో వంశీ కృష్ణపై ఉభయ తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటకలో కలిపి 20కి పైగా కేసులు ఉన్నట్టుగా వెల్లడైంది. నిందితుడు షాదీ డాట్​ కామ్​, ఇన్​ స్టాగ్రాం, ఫేస్​ బుక్​ లలో తనను తాను సంపన్నుడైన వ్యాపారిని అని, ఎన్నారైనని, ఐటీ ఉద్యోగినని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ప్రొఫైల్​ అప్​ లోడ్​ చేసేవాడని తెలిసింది. ఇది చూసి నిజమే అనుకుని ఎవరైనా సంప్రదిస్తే తీయటి మాటలతో వారి నమ్మకాన్ని సంపాదించేవాడని వెల్లడైంది.

Also Read: CM Revanth Reddy: సందేహం వద్దు సోదరా.. ప్రజామద్దతు మాకే.. సీఎం రేవంత్ రెడ్డి

ఆ తరువాత తన బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్​ చేశారని, అత్యవసరంగా మెడికల్​ ఖర్చులు వచ్చాయని, వ్యాపారంలో డబ్బు పెట్టాల్సి ఉందని అవతలి వారిని నమ్మించి లక్షల్లో డబ్బు గుంజినట్టుగా స్పష్టమైంది. ఇచ్చిన డబ్బును వాపసు చేయమని అడిగితే నీ పర్సనల్​ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి..డబ్బు అడిగితే సోషల్​ మీడియాలో అప్ లోడ్​ చేస్తానని బెదిరించే వాడని వెల్లడైంది. ఇలా 2‌‌‌‌‌‌0కి పైగా నేరాలు చేసినట్టుగా తేలింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/  ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్