Vishnu Manchu: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఏప్రిల్ 25న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మంచు విష్ణు మీడియా సమావేశాలు నిర్వహించారు. తెలుగు మీడియాకు కూడా వన్ టు వన్ ఇంటర్వ్యూలు ఇస్తూ, అందులో ఆసక్తికరమైన విషయాలు చెబుతూ.. ‘కన్నప్ప’ను వార్తలలో ఉంచుతున్నారు. అంతకు ముందు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శంచుకుంటానని, ఆ వివరాలను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానని ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేసిన విష్ణు, ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా భక్త కన్నప్ప సొంత ఊరిలో దర్శనమిచ్చారు.
Also Read- Samantha: తెలుగులో సినిమాను నిర్మిస్తోన్న సమంత.. టైటిల్ ఇదే!
అవును కన్నప్ప సొంత ఊరిలో ఉన్న శివాలయంలో విష్ణు మంచు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్త కన్నప్పది అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలో ఉన్న ఊటుకూరు గ్రామం. ఈ గ్రామంలో ప్రసిద్ధమైన శివాలయం ఉంది. ఈ శివాలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లిన మంచు విష్ణు అండ్ టీమ్‌కు ఆ ఊరి గ్రామస్థులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఆ గ్రామంలో కన్నప్ప నివసించిన స్వగృహాన్ని సందర్శించిన అనంతరం, అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంచు విష్ణు. ఆ శివాలయ విశిష్టతను అడిగి తెలుసుకున్న విష్ణు, ఆ ఆలయాన్ని మరింతగా అభివృద్ది చేయిస్తానని ఆ గ్రామ ప్రజలకు విష్ణు మాట ఇచ్చారు.
ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడేలా చేశాయి. రానున్న రోజుల్లో ప్రమోషన్స్‌లో మరింత వేరియేషన్స్ ఉండేలా.. ‘కన్నప్ప’ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ నటీనటులు నటిస్తోన్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న భారీ ఎత్తున విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.
మంచు విష్ణుకు ఈ సినిమా ఎలా అయితే డ్రీమ్ ప్రాజెక్టో.. సినిమా హిట్ అవడం కూడా అంతే ప్రాముఖ్యంగా మారింది. ఆయన నుంచి ఇంతకు ముందు వచ్చిన కొన్ని సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయాయి. అందులోనూ ఈ సినిమా పాన్ ఇండియాగా రూపుదిద్దుకోవడంతో.. ఈ సినిమా విషయంలో మంచు విష్ణు ప్రతీది తానై చూసుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా మంచు ఫ్యామిలీ ప్రమోషన్స్ ఇంత భారీగా నిర్వహిస్తుండటం చూస్తుంటే.. ఈ సినిమా సక్సెస్ మోహన్ బాబు, విష్ణులకు ఎంత అవసరమో అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి:
David Warner: బౌండరీ టు బాక్సాఫీస్.. గంగి రెడ్డి ఎట్టున్నది వార్నర్ మామ లుక్!
Devi Sri Prasad: ఎక్కడ వాయించాలో, ఎక్కడ వాయించకూడదో తెలిసినవాడే నిజమైన మ్యూజిక్ డైరెక్టర్