ఏటూరునాగారం/మహబూబాబాద్ స్వేచ్ఛ:Mulugu District News: ములుగు జిల్లాకు మంత్రి ఉన్నారనుకుని, ఇక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారనుకుంటే ఏకంగా రూ. 33 కోట్ల అవినీతికి తెరలేపారని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహారావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ అసెంబ్లీలో మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు.
అసెంబ్లీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజా శ్రేయస్సు కోసం గల మెత్తిన జగదీశ్ రెడ్డి ని సస్పెన్షన్ వేటు మాటున అసెంబ్లీ సమావేశాలకు దూరం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 బూటకపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చ కుండా బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్నారని విమర్శించారు.
తమ ప్రభుత్వం కాకపోయినా జిల్లాకు మంత్రి పదవి రావడంతో సంతోషపడ్డామని, జిల్లాలో తూ తూ మంత్రంగా అభివృద్ధి పనులను చేపట్టి రూ. 33 కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. గోదావరి కరకట్ట పనులు చేపట్టకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. మంత్రి అయిన సీతక్క ములుగు జిల్లాకు ఏం చేశారో తెలుపాలని డిమాండ్ చేశారు.
Also Read- Raja Singh on Asaduddin: ఒవైసీకి మెంటల్.. సీఎం గారూ.. ట్రీట్మెంట్ ఇప్పించండి – రాజాసింగ్
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేసిఆర్ చొరవ చూపిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుందని ఆరోపించారు. రైతులు పండించే మిర్చికి క్వింటాకు రూ. 25 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.