raja singh on asaduddin
తెలంగాణ

Raja Singh on Asaduddin: ఒవైసీకి మెంటల్.. సీఎం గారూ.. ట్రీట్మెంట్ ఇప్పించండి – రాజాసింగ్

Raja Singh on Asaduddin: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. ప్రత్యర్థులనే కాదు తేడా వస్తే సొంత పార్టీ(BJP) నేతలను కూడా చీల్చీ చెండాడే నైజం ఆయనది. ఇలా చేసే ఆయన ఓ సారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. అయినా అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా తనదైన శైలిలో ముందుకు వెళ్తుంటారు. అదే రాజాసింగ్ స్టైల్. దేశంలో కరుడుగట్టిన హిందూ నేతల జాబితా తీస్తే అందులో టాప్ 10లో రాజాసింగ్ ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలో మాత్రం ఆ విషయంలో ఆయనతో పోటీ పడే లీడర్ లేరనే చెప్పాలి.

ఒక హర్డ్ కోర్ హిందూ నాయకుడిగా.. ఆయన అనునిత్యం ఎంఐఎం పార్టీ వ్యవహారాలని, ఒవైసీ బ్రదర్స్ కదలికల్ని గమనిస్తుంటారు.  బీజేపీ గురించి గానీ, దేశం గురించి గానీ ఒవైసీ బ్రదర్స్ మాట తూలినట్లు, విమర్శించినట్లు దృష్టికి వచ్చినా సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చేస్తారు. హోలీని పురస్కరించుకొని ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో… గురువారం ఆయన సీఎం రేవంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాజాసింగ్ మరో వీడియోను విడుదల చేశారు.

వీడియో(Video)లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆయన ఏమన్నారంటే.. ‘‘ శుక్రవారం హోలీ(Holi) పర్వదినం సందర్భంగా హిందువులంతా సంతోషంగా పండుగ జరుపుకున్నారు. అయితే హోలీ రోజే ఓవైసీ ముస్లీంలతో పెద్ద ఎత్తున నమాజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అని తెలిపారు.

రంజాన్ ముస్లింలకు పవిత్ర మాసంగా పేర్కొంటారని, అలాంటి పవిత్ర మాసంలో ఓవైసీ హిందువుల మీద ప్రధాని మీద విషం కక్కుతున్నారని విమర్శించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లింలకు చేసిన సూచనను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ యోగి ఏమన్నారంటే.. హోలీ సందర్భంగా ఒక్క రోజు ముస్లింలంతా ఇళ్లల్లోనే నమాజ్ చేసుకోవాలని సూచించారు. హోలీ కాబట్టి మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్నందున ఈ సూచన చేశారని రాజాసింగ్ తెలిపారు. అది మంచి కోసం చెప్పారని, కానీ ఓవైసీ.. ‘నమాజ్ ఎలా చేసుకోవాలో ముస్లింలకు నేర్పుతున్నారా?’ అంటూ వంకర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో హోలీ సందర్భంగానే జార్ఖండ్, లూథియానా తదితర ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగాయని వివరించారు. ఈ విషయం అసదుద్దీన్ కు అర్థం కాక బుద్ధిలేనట్లు ప్రవర్తిస్తున్నారన్నారు.

తెలంగాణలో హోలీ బ్రహ్మండంగా జరిగిందని, ముస్లింలు కూడా ఇంట్లోని ఉండి సహకరించారని కానీ ఒవైసీ మాత్రం కావాలని ఈ పనులు చేస్తూ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మెంటల్ కండిషన్ బాలేదని, ఆయనతో పాటు సోదరుడు అక్బరుద్దీన్ కు కూడా చికిత్స చేయించాలని సీఎం రేవంత్ కు సూచించారు. ఎందుకంటే.. రేవంత్ కు ఒవైసీ బ్రదర్స్ కొత్తగా స్నేహం ఏర్పడిందని, కాబట్టి నూతన మిత్రులకు మంచి చికిత్స అందించాలని కోరారు. అప్పుడే తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు