Heatwave Alert
లైఫ్‌స్టైల్

Heatwave Alert: వడదెబ్బకు గురైతే.. వెంటనే ఇలా చేయండి

మహబూబాబాద్ స్వేచ్ఛ: Heatwave Alert: జిల్లాలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి జి.మురళీధర్ శనివారం తెలిపారు. వేసవి కాలంలో తీవ్రమైన ఎండ, వేడి గాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

వేసవికాలంలో వడ దెబ్బకు గురైనప్పుడు ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం, తీవ్రమైన తలనొప్పి, నాలుక ఎండి పోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం (తగ్గడం), మూత్రం గాఢ పసుపు రంగులో ఉండి మంట రావడం, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళే అన్ని లక్షణాలు, లేదా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.

Also Read: Heatwave alert: ఆ జిల్లాలలో మండే ఎండలు.. వార్నింగ్ ఇచ్చిన వాతావరణ శాఖ..

వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశానికి చేర్చాలని సూచించారు. శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలని చెప్పారు. ఎండ దెబ్బ తగిలిన వారికి ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజు, పప్పుకట్టు, ఓఆర్ఎస్ ద్రావణాన్ని సాధించాలని వివరించారు. సత్వర చర్యల కోసం 108 అత్యవసర సేవలను సంప్రదించాలని తెలిపారు. ప్రథమ చికిత్స చేసిన తరువాత దగ్గరలో గల ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని తెలిపారు.

వడ దెబ్బ తగలకుండా ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగడం, ఆడటం చేయవద్దన్నారు. తప్పనిసరి పరిస్థితులలో ఎండలోకి వెళితే గొడుగు, టోపీ, తెల్లని రుమాలు తప్పక ధరించాలని చెప్పారు. తెల్లని నూలు వస్త్రాలు ధరించడంతోపాటు అధికంగా నీరు, ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు.

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!