Bihar Crime:
క్రైమ్

Bihar Crime: చోరీలలో ఇదో వెరైటీ.. గోల్డ్ రింగ్స్ మింగేసి మరీ..

Bihar Crime: కాలం మారిపోయింది. లోకం సీసీ కెమెరాల(CC cameras) మయం అయిపోయింది. ఎక్కడా చూసిన కెమెరాలే. చిన్న షాపు వాడు కూడా పెట్టుబడికి బెదరకుండా నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. సరే.. ఇదంతా మంచిదే కదా. సెక్యూరిటీ కోసం ఆ మాత్రం పెట్టుకోవడం మంచి విషయమే కదా అంటారేమో. కస్టమర్లకు అంటే కొనేవాళ్లకు మంచిదే, కానీ కొట్టేయాలనుకునే వాళ్లకే కష్టం వచ్చి పడింది.

సెక్యూరిటీ కెమెరాల పుణ్యమా అని … జులాయి సినిమాలో బ్రహ్మానందం లాగా దొంగతనం చేసిన కాసేపటికే చోరులు(thieves) దొరికిపోతున్నారు. పాపం దీనివల్ల దొంగతనాలు చేయడం కష్టసాధ్యమైపోతున్నది. దొంగతనాల కోసం ఎన్నో కొత్త టెక్నిక్స్ ఉపయోగిస్తున్న కూడా ఇట్టే దొరికిపోతున్నారు. తాజాగా, బీహార్ లోని ఓ నగల దుకాణంలో ఆభరణాలు ఎత్తుకెళ్లిన(Jewellery theft) ఓ మహిళ సీసీ ఫుటేజీ ఆధారంగా దొరికిపోయింది.

 Also Read: 

Ganja Seized: హైదరాబాద్ లో ఈ ఐస్ క్రీమ్ తిన్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ కావాల్సిందే!

Swetcha Effect: ‘స్వేచ్ఛ’ వరుస కథనాల ఎఫెక్ట్.. స్పందించిన గవర్నర్.. రైతన్నల హర్షం

ఉంగరాలను మింగేసింది

బీహార్ లోని నలందలో ఉన్న ఓ నగల దుకాణానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. వెళ్లి కుర్చున్నాక.. అందరి లాగే షాపు సిబ్బందితో నగలు చూపించడని కోరారు. దాంతో డిస్ ప్లే లో నుంచి నగలను బయటికి తీసి పలు రకాల వెరైటీలను వాళ్ల ముందు ఉంచారు. అందులో భాగంగానే కొన్ని ఉంగరాలను ఆ ఇద్దరి మహిళల ముందు ఉంచారు. అయితే.. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు… షాపు సిబ్బంది కన్నుగప్పి కొన్ని ఉంగరాలను మింగేసింది. తర్వాత కొద్దిసేపు విండో షాపింగ్ చేసి ‘ఏవీ నచ్చలేదు’ అంటూ ఆ ఇద్దరు షాపు నుంచి బయటికి వెళ్లబోయారు. అంతలోనే వాళ్లకు చూపించిన ఆభరణాలలో కొన్ని రింగులు తక్కువ ఉన్నట్లు సిబ్బంది పసిగట్టారు.

వెంటనే వాళ్లను పారిపోకుండా ఆపి.. సీసీ ఫుటేజీలో చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. దీంతో తెల్లమొహం వేయడం ఆ మహిళల వంతైంది. ‘అబ్బా… కొద్దిలో మిస్సయ్యాం’ అని మహిళల ఇన్నర్ ఫిలింగ్స్ అయి ఉండొచ్చు కానీ చూసిన వాళ్లు మాత్రం… ‘మేము ఎన్నో మోసాలు చూశాం కానీ… ఇలాంటి మోసం చూడలేదు’ అని మీమ్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నారీమణుల ‘నగల చౌర్య కథా చిత్రమ్’ వైరల్ గా మారింది.

మరోవైపు టెక్నాలజీ పెరిగే కొద్ది దోపీడీలు దొంగతనాలు కూడా పెరుగుతుండటం దురదృష్టకరం. పలు చోట్ల ఏటీఎంలు ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్ లు ధరించి చోరీలు చేస్తున్నారు. అయితే ఆయా షాపుల్లో మహిళలు చేతివాటం చూపించి, వస్తువులను చీరలో దాచుకోవడం వంటి దృశ్యాలు చాలా వైరల్ వీడియోల్లో గమనించే ఉంటాం. అలాంటి వాటిలో  వైరల్ అయ్యాక కొన్ని సందర్బాల్లో టీవీ చానెల్ లలోనూ ప్రసారం చేస్తుంటారు. అయినా సరే… దేశంలో ఎక్కడో ఓ చోట ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. తిరిగి వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదీ నిత్యకృత్యమే.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!