Swetcha Effect
తెలంగాణ

Swetcha Effect: ‘స్వేచ్ఛ’ వరుస కథనాల ఎఫెక్ట్.. స్పందించిన గవర్నర్.. రైతన్నల హర్షం

ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Swetcha Effect: ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల దురాగతంపై స్వేచ్ఛ కథనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్ఫోటనం చెందుతున్నాయి. రైతులకు జరిగిన అన్యాయంపై స్వేచ్ఛ డిజిటల్ న్యూస్ ప్రత్యేక కథనాలను కళ్ళకు కట్టినట్టుగా వరుసగా ప్రచురితం చేసింది.స్వేచ్ఛ వరుస కథనాల ఎఫెక్ట్… స్పందించిన గవర్నర్, వివిధ శాఖల రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్ స్వేచ్ఛ కథనాలతో రైతులకు కొండంత అండ లభించింది.

స్వేచ్ఛ కథనాలు ఇచ్చిన భరోసాతో రైతులు, ఆదివాసి నవనిర్మాణ సేన అధ్యక్షుడు కొరస నరసింహమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కోదండ రెడ్డికి రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కోదండ రెడ్డి దృష్టికి బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ద్వారా నష్టపోయిన రైతుల విషయం చేరింది.

వెంటనే స్పందించిన వ్యవసాయ కమిషన్ కోదండ రెడ్డి జిల్లా జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు జరిగిన నష్టపరిహారంపై వెంటనే నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సందర్భంగా మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా బహుళ జాతి మొక్కజొన్న కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులకు చేసిన మోసాలపై రైతులు, ఆదివాసి నవనిర్మాణ సేన అధ్యక్షుడు నరసింహమూర్తి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వినతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన గవర్నర్ కలెక్టర్ దివాకర్ టిఎస్ కు ఆర్గనైజర్లు, విత్తన కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆ మరుసటి రోజు జిల్లా కలెక్టర్ వాజేడు మండలం సందర్శించి రైతులకు జరిగిన విషయంపై ఆరా తీశారు. అదే రోజు పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వాజేడు వెంకటాపురం మండలాలను సందర్శించారు.

గురువారం విత్తన అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, పంటచేండ్ల పరిశీలన ఇక్రిశాట్ మాజీ శాస్త్రవేత్త రామాంజనేయులు, పబ్లిక్ పాలసీ ఎక్స్పెక్ట్ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు లు వాజేడు, వెంకటాపురం మండలాల్లో సందర్శించారు. వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి, వాజేడు మండలంలోని బిజినేపల్లి, ఎర్ర గూడెం రైతుల తో బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ద్వారా నష్టపోయిన తీరును తెలుసుకున్నారు.

రైతులకు పంపిణీ చేసిన విత్తనాలు ఎరువులు కీటక నాశని మందులు, గుళికలకు ఎలాంటి బిల్స్ లేవని గుర్తించారు. బిల్లులు వాటిపై విధించే జిఎస్టి ఎందుకు రైతులకు ఇవ్వలేదో ఆరా తీశారు. మొక్కజొన్న కంకులు తింటే రైతులు పక్షవాతం బారిన ఎందుకు పడుతున్నారో…. దీనికి కారణం భేటీ విత్తనాలై ఉండాలి లేదంటే క్రిమిసంహారక రసాయన ఎరువులు అధిక విషపూరితమైన కీటక నాశిని కి సంబంధించిన మందులై ఉండాలనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ములుగు పర్యటన రోజునే హైదరాబాద్ వ్యవసాయ ల్యాబ్ నుండి కొంత మంది అధికారులు వాజేడు వెంకటాపురం మండలాలకు వచ్చి రైతుల నుండి శాంపిల్స్ సేకరించారు. శాంపిల్ ల్యాబ్లో పరీక్షించిన అనంతరం బీటికి సంబంధించిన విత్తనాల లేదంటే మరో రకమైన విత్తనాలని తేలాల్సి ఉంది.

మొదటి ఏడు నష్టం… రైతుల నుండి ప్రాంసరీ నోట్లు

బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీలు సరఫరా చేసే విత్తనంతో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు వస్తాయని రైతులను ఆర్గనైజర్లు మభ్యపెట్టి వ్యవసాయం చేయించారు. అమాయక ఆదివాసి రైతులు ఆర్గనైజర్లు చెప్పిన మాటలకు ఆకర్షితులై బహుళ జాతి విత్తన కంపెనీలు సరఫరా చేసే మొక్కజొన్న విత్తనాలను సేద్యం చేశారు. ఆ ఏడాది పెట్టుబడులు పోను మిగిలిన అప్పులను ప్రామిసరీ నోటు పైన రాయించుకున్నారు. మరుసటి ఏడాది అప్పులు ఇస్తారా… పంట వేస్తారా అనే డిమాండ్తో ఆర్గనైజర్లు రైతులను ఒత్తిడికి గురిచేసి వ్యవసాయం చేసేందుకు దోహద పడ్డారు.

ఈ అప్పుల ఊబిలో ఎలా చిక్కుకున్నామో అర్థం కాని రైతులు ఆర్గనైజర్లు సూచించిన ప్రకారమే వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగైదు ఏళ్ళు అయ్యేసరికి అప్పుడు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి అంకంలో పంట దిగుబడి చూస్తే రైతులకు ఏం చేయాలో పాలు పోలేదు.

దీంతో రోడ్ ఎక్కారు.. తమను ఆదుకోమని అధికారులను వేడుకున్నారు… ఇదే సమయంలో స్వేచ్ఛ డిజిటల్ న్యూస్ “సీడ్ బాంబ్” పేరిట అంతర్జాతీయ విత్తన కంపెనీల దురాగతం పై ప్రచురించింది. దీంతో అప్పటివరకు ఏం చేయాలో పాలు పోనీ రైతులు ఆదివాసి నాయకులు.. స్వేచ్ఛ వరుస కథనాలతో వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందింది.

స్వేచ్ఛ ఇచ్చిన భరోసాతోనే అధికారులకు ఫిర్యాదు చేయడం రైతులు మొదలుపెట్టారు. స్విట్జర్ ల్యాండ్, థాయిలాండ్ వంటి ఇంటర్నేషనల్ బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల మోసాలపై రైతులకు స్వేచ్ఛ అండగా నిలుస్తుంది. ఇక పైన రైతులకు న్యాయం జరిగే వరకూ కథనాలు ప్రచురిస్తూనే ఉంటుంది.

స్వేచ్ఛ వరుస కథనాల పరంపర

స్వేచ్ఛ డిజిటల్ న్యూస్ అక్రమాల అవినీతి పుట్టను… అసాంఘిక కార్యకలాపాలను ఎత్తిచూపడంలో దిట్టగా పేరుగాంచింది. ఆ క్రమంలోనే ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు కన్నాయిగూడెం ఏటూరు నాగారం మంగపేట వరంగల్ జిల్లా గూడెప్పాడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల మండలం లో బహుళ జాతి విత్తన కంపెనీల మోసాలకు అమాయక, ఆదివాసి రైతులు కుప్పకూలిపోయారు. దీంతో స్వేచ్ఛ రైతులను ఆదుకునేందుకు నడుంబిగించింది. జనవరి ఆరో తేదీన వెంకటాపురం, వాజేడు మండలాల్లో రైతుల ఆందోళన నేపథ్యంలో సీడ్ బాంబ్ పేరిట ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అప్పటివరకు రైతుల ఆందోళనలు అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. స్వేచ్ఛ కథనంతో ఆర్గనైజర్లు ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ పైన స్వేచ్ఛ కథనం ప్రచురించింది. స్వేచ్ఛ కథనం చూసిన ఆర్గనైజర్లు రైతులను బెదిరించ సాగారు. విత్తన కంపెనీల బరితెగింపు… రైతులకు బెదిరింపులు కదనాన్ని సైతం ప్రచురింపజేసింది స్వేచ్ఛ.

స్వేచ్ఛ కథనాలతో ఎంక్వైరీ స్పీడ్ అప్ చేసి ఆర్గనైజర్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. రైతుల ఆందోళన నేపథ్యంలో స్విట్జర్లాండ్, థాయిలాండ్ ఇంటర్నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీ ల్యాబ్ లలో తయారైన విత్తనాలను నేరుగా ఆదివాసీ రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో పంటగా మారిపోయింది. ఎందుకు సంబంధించి ల్యాబ్ టు ల్యాండ్ పైన కథనాన్ని ప్రచురించింది.

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

ఆ మరుసటి రోజు సీడ్ బాంబ్ ఇష్యూలోకి గవర్నర్ ఎంట్రీ అనే కథనాన్ని సైతం స్వేచ్ఛ ప్రచురింపజేసింది. తాజాగా గురువారం తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, పంట చేనుల పరిశీలన ఇక్రిశాట్ మాజీ శాస్త్రవేత్త రామాంజనేయులు, పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు సైతం రైతులను కలిసేందుకు స్వేచ్ఛ కథనాలను ప్రచురించింది.

Also Read: TGIIC On Gachibowli Lands: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదే.. ఆ వార్తలు పుకార్లే!

బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు, యాజమాన్యాల నుండి నష్టపోయిన పరిహారం చెల్లించే వరకు “స్వేచ్ఛ డిజిటల్ న్యూస్” రైతుల వెన్నంటే ఉంటుంది.. న్యాయం జరిగేదాకా కథనాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది.

Just In

01

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!