Actor Sivaji: మ్యూజిక్ సంచలనం ఎస్. థమన్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడూ ప్రశ్నించేది ఏమిటంటే.. ఏం తాగి కొట్టావ్ బాబూ.. రెడ్ బుల్ తాగి కొట్టావా? అంటూ క్వశ్చన్ చేస్తుంటారు. అలాగే ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ.. అనే సినిమా చూసిన వారంతా నటుడు శివాజీని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఏమా యాక్టింగ్? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ (Court- State vs Nobody) సినిమాలో మంగపతిగా శివాజీ నటించారు. ఆ పాత్రలో శివాజీ నటనకు అంతా ఫిదా అవుతూ నీరాజనాలు పడుతున్నారు. ఇన్నాళ్లూ ఎక్కడున్నావన్నా? అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే, ఏ రేంజ్‌లో శివాజీ (Actor Sivaji) ఈ సినిమాలో నటనను ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Puri Jagan – Charmy: పూరి జగన్ – ఛార్మీల మధ్య ఏం జరిగింది? వారిద్దరూ నిజంగా విడిపోయారా?
శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పీక్ స్టేజ్‌లో ఉండగానే నటనకు బ్రేక్ ఇచ్చిన శివాజీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అవుతున్న సమయంలో పొలిటికల్ స్పీచ్‌లతో పోరాటానికి దిగారు. నటుడిగా కనిపించకపోయినా, న్యూస్ ఛానళ్లలో మాత్రం ఆయన రెగ్యులర్‌గా కనిపిస్తూనే వచ్చారు. కొన్ని ఒడిదుడుకుల తర్వాత మళ్లీ నటించాలనే నిర్ణయానికి వచ్చిన శివాజీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం మంచి మంచి పాత్రలతో నటుడిగా మెట్ల మీద మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని ఎంతో ఆదరణను రాబట్టుకున్న శివాజీని ‘90స్’ వెబ్ సిరీస్.. ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆ వెబ్ సిరీస్‌లోని పాత్రతో శివాజీ గ్యాప్‌ని ఫిల్ చేసేశారు.
తాజాగా ఆయన నేచురల్ స్టార్ నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన కోర్టు డ్రామా ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనే చిత్రంలో మంగపతి పాత్రలో నటించారు. ఈ సినిమా చూసిన వారంతా శివాజీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది నిజంగా శివాజీ నట విశ్వరూపం అంటూ కితాబిస్తున్నారు. ఇంత నటన పెట్టుకుని ఎందుకింత గ్యాప్ ఇచ్చావ్ అన్నా? ‘మంగపతి’.. ఏం తాగావ్ బాబూ.. ఏంటా యాక్టింగ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విశ్లేషకులు కూడా తమ రివ్యూస్‌లో సినిమా హైలెట్స్‌లో ఒకటిగా శివాజీ పాత్రను కొనియాడుతున్నారు.
ప్రస్తుతం రియాలిటీ ప్రపంచంలో చూసిన కొన్ని పాత్రలకు ఆపాదించుకునేలా మంగపతి పాత్ర ఉండటంతో, చాలామంది శివాజీ పాత్రకు కనెక్ట్ అయిపోతున్నారు. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడం చాలా మంది నటుల విషయంలో జరుగుతూనే ఉంటుంది.. కానీ, ఇలాంటి సాలిడ్ పాత్రతో రీఎంట్రీ ఇవ్వడం శివాజీకే చెల్లింది అంటూ, భవిష్యత్‌లో ఈ తరహా పాత్రలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన అభిమానులు సైతం కోరుతున్నారు. ప్రస్తుతం చిత్ర టీమ్ అంతా సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతోంది.
ఇవి కూడా చదవండి:
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం
Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారింది.. ఫైనల్‌గా ఆ ఐకానిక్ డేట్ ఫిక్సయింది