తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: TG Govt – HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నిన్న మొన్నటి వరకు హెచ్ఎండీఏ పరిధిలోనున్న 36 గ్రామాలు ఇపుడు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకువస్తూ స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియాగా గుర్తించింది. ఇందుకు సీఎం అధ్యక్షతన కమిటీని కూడా నియమించింది. తాజాగా హెచ్ఎండీఏలో పరిధిలోకి 1355 గ్రామాలు,104 మండలాలు, 11 జిల్లాలను చేర్చుతూ హెచ్ఎండీఏ పరిధిని దాదాపు 10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా)ని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు.2008లో అప్పటి ప్రభుత్వం హుడాను హెచ్ఎండీఏగా మార్చింది. దీంతో హెచ్‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. తాజాగా సర్కారు చేసిన విస్తరణ ప్రకారం ప్రస్తుతమున్న హెచ్ఎండీఏ విస్తరణ రెండింతలు అవుతుందన్న చర్చ జరిగినప్పటికీ, సర్కారు కేవలం పరిధిని పదిన్నర వేల కిలొమీటర్లకు పరిమితం చేసింది.
ఒక రకంగా చెప్పాలంటే సర్కారు విస్తరించాల్సిన హెచ్ఎండీఏ పరిధిలో కోత విధించి, 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీగా చెప్పుకునే స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియాలో విలీనం చేసి, ఫ్యూచర్ సిటీ కింద అభివృద్దిఅలాగే హెచ్ఎండీఏ విస్తీర్ణయాన్ని పెంచుతూ విలీనం చేసిన జిల్లాల్లోనూ రియల్ఎస్టేట్ ఇప్పటికే పుంజుకున్నట్లు వాడీ వేడి చర్చ జరుగుతుండగా, తాజాగా ఫ్యూచర్ సిటీలో విలీనం చేసిన 36 గ్రామాల అభివృద్ది పై మరింత ఆసక్తి నెలకొంది.
హెచ్ఎండీఏ నుంచి స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియాలోకి విలీనం చేసిన గ్రామాలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్న మండలంలోని కపాపహాడ్, పోచారం, రాంరెడ్డి గూడ, తడ్లకల్వ, తులెకలాన్, తుర్కగూడ,ఎలిమినేడు, ఎర్రకుంట గ్రామాలు హెచ్ఎండీఏ పరిధి నుంచి తొలగించి ఫ్యూచర్ సిటీ (స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియా)లో విలీనం చేస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
వీటితో పాటు రంగారెడ్డి జిల్లా లోని కందుకూరు మండలం పరిధిలోని అన్నోజిగూడ, డబ్లీగూడ,దాసర్ల పల్లి, గఫూర్ నగర్, గుడూర్, గుమ్మడవెల్లి, కందుకూరు, కొత్తూర్, లేమూర్, మాదాపురం, మీర్ ఖాన్ పేట, ముచ్చెర్ల, మొహమ్మద్ పూర్, పంజాగూడ, రాచ్ లూరు,సర్వరావులపల్లె, తిమ్మాపూర్, తిమ్మాయపల్లి, మహేశ్వరం మండలంలోని మోహబ్బత్ నగర్, తుమ్ లూర్ గ్రామాలను స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియాలో విలీనం చేశారు.
వీటితో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని మంచాల్ మండలం పరిధిలోని ఆగాపల్లి, మల్లికార్జున్ గూడ, నోముల్ గ్రామాలతో పాటు యాచారం మండలం పరిధిలోని చౌదర్ పల్లి, గుంగాల్, మగల్ వంపు, తులేకుర్థ్, యాచారం గ్రామాలను విలీనం చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. 36 గ్రామాల్లో ప్రస్తుతం ప్రజలకు వివిధ రకాలైన సేవలందిస్తున్న వివిధ శాఖలకు చెందిన స్టాఫ్ కూడా త్వరలోనే స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియాకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.
అభివృద్ది దిశగా అడుగులు..కొలిక్కొచ్చిన మెట్రో కారిడార్
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రేస్ సర్కారు కొలువుదీరిన వెంటనే ఫోర్ట్ సిటీ అభివృద్దిపై సర్కారు ప్రత్యేక చొరవ తీసుకుంది. నిన్నమొన్నటి వరకు హెచ్ఎండీ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని 36 గ్రామాలను హెచ్ఎండీఏ పరిధి నుంచి స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియాకు మార్చిన సర్కారు ఇప్పటికే ఆ ఏరియా అభివృద్దిపై ఎంతో ముందు చూపుతో వెళ్తుంది. శంషాబాద్ విమానాశ్రయ ఏయిర్ పోర్డు నుంచి ఫోర్ట్ సిటీకి ప్రత్యేక మెట్రో కారిడార్ కు గ్రీన్ ఇచ్చిన నేపథ్యంలో అభివృద్ది వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.
ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ డా. ఎన్వీఎస్ రెడ్డి ప్రాజెక్టు స్థల సేకరణ కోసం క్షేత్ర స్థాయి పరిశీలన కూడా నిర్వహించిన సంగతి తెల్సిందే. పనులు వేగంగా ముందుకు కదిలేందుకు, ఫ్యూచర్ సిటీలో అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ప్రాజెక్టు స్థల సేకరణలో జాప్యం జరగకుండా , వీలైనంత ఎక్కువ సంఖ్యలో సర్కారు ఆస్తుల నుంచే స్థలాలను సేకరించనున్నట్లు ఆయన స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.
ఇప్పటికే ఫ్యూచర్ సిటీలోని పలు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశన్నంటిని నేపథ్యంలో తాజాగా విలీనం చేసిన 36 గ్రామాల్లో సైతం భూముల ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. సర్కారు ఫ్యూచర్ సిటీని ప్రకటించిన తర్వాత ఆ సిటీకి దగ్గరగా ఉన్న ఈ 36 గ్రామాల్లో భూములు రేట్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కానీ ఈ స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియాకు సంబంధించి సర్కారు స్పెషల్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందా? అన్న విషయంపై త్వరలోనే సర్కారు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీని స్పెషల్ డెవలప్ మెంట్ ఏరియాగా ప్రకటించిన సర్కారు త్వరలోనే అభివృద్దికి సంబంధించి మరిన్నిసంచల నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం