Pelli Kani Prasad Photo
ఎంటర్‌టైన్మెంట్

Pelli Kani Prasad: ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు ఎక్స్‌పెయిరీ డేట్.. సరిసర్లే ఎన్నెన్నో అనుకుంటాం!

Pelli Kani Prasad Trailer: కమెడియన్ కమ్ హీరో సప్తగిరి నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. మార్చి 21న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సంస్థ రిలీజ్ చేస్తోంది. హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా తయారై, రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Also Read- Chiranjeevi – Nani: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!

నాన్నా 34.. 36 అని తన వయసును కొడుకు చెబుతుంటే.. నీకు ఏజ్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియెన్స్ కూడా పెరుగుతుంది కదరా. దాని చూపించి ఎక్కువ కట్నం డిమాండ్ చేయవచ్చు నాన్న అనే తండ్రి. ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు ఎక్స్‌పెయిరీ డేట్ కూడా దగ్గరపడుతుంది నాన్నా.. అంటూ పెళ్లి కోసం ఎన్ని తంటాలు పడుతున్నాడో చెప్పే కాంబినేషన్ డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ మొదలైంది.

‘కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న.. ఆన్‌లైన్‌లో తీసుకుంటే జీఎస్టీ టాక్స్ కట్టవుతుందని అంటున్నారు’, ‘ఇలాంటి సమస్య ‘ఉప్పెన’ సినిమాలో ఆశికి, బేబమ్మకి ఎదురైతే వాళ్లేం చేశారో తెలుసా? తర్వాత వాళ్ల నాన్న ఏం చేశాడో తెలుసా?’ అనే డైలాగ్స్‌తో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా నడిచిన ఈ ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. తేడా వస్తే.. ముక్కలు ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడకబెడతా.. అని సప్తగిరి మార్క్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ ముగిసింది.

36 ఏళ్ళ ప్రసాద్‌పెళ్లి గురించి ఆందోళన చెందుతుంటాడు. హీరోయిన్ విషయానికి వస్తే, ఆమె తనకు మద్దతు ఇవ్వడమే కాకుండా, తన మొత్తం కుటుంబాన్ని ఫారెన్ తీసుకెళ్లే వరుడి కోసం చూస్తుంటుంది. వీరిని విధి ఒకచోట చేర్చుతుందా? అనేది ట్రైలర్‌లో హిలేరియస్‌గా ప్రజెంట్ చేశారు.

పెళ్లి కాని ప్రసాద్‌గా సప్తగిరి తనకే సాధ్యమైన హ్యూమరస్ నటనతో ఆకట్టుకుంటే, హీరోయిన్ ప్రియాంక శర్మ కూడా ఎక్కడా తగ్గలేదు. ఇంకా మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ పాత్రలు కామెడీ పోర్షన్‌ని మరింతగా పంచుకున్నాయి. సాంకేతికంగా కూడా సినిమా రీచ్‌గా ఉంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలెట్ అనేలా ఉంది. ఇక థియేటర్లలో ఈ పెళ్లి కాని ప్రసాద్ నవ్వుల కోసం రెడీ అయిపోండి.

ఒక వైపు హీరోగా చేస్తూనే, మరోవైపు హీరోల పక్కన నటిస్తూ సప్తగిరి బిజీబిజీగా ఉంటున్నారు. ఈ సినిమా హీరోగా తనకి మంచి గుర్తింపును తీసుకువస్తుందని ఎంతగానో నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తుందో తెలియాలంటే మాత్రం మార్చి 21 వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:
Mahesh – Rajamouli: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!

Soundarya Husband: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?