Jr NTR Talent: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌లో దాగివున్న ఓ కళని సెలబ్రిటీలు బయటపెడితే.. ఇక ఆయన అభిమానులను పట్టుకోతరమా! ఎన్టీఆర్ గురించి ఆయన అత్త పురందేశ్వరి చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్నట్టే.. అమల, అఖిల్, శర్వానంద్, రానా, వెంకటేష్ లు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ తెలిస్తే.. తారక్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అంతా ఆశ్చర్యపోతారు. ఇంతకీ తారక్‌లో ఉన్న ఆ టాలెంట్ ఏమిటని అనుకుంటున్నారా?
రంజాన్ మాసం వస్తే అందరికీ గుర్తొచ్చేది ‘హలీమ్’. సెలబ్రిటీలు కొందరు హలీమ్‌ని బాగా ఇష్టపడతారు.. ఇష్టంగా తింటారు కూడా. కానీ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఆయన హలీమ్‌ని కుక్ చేస్తారు. అవును, ఈ విషయం స్వయంగా అఖిల్, శర్వానంద్‌లు అమల అక్కినేనికి చెబుతున్నారు. ఈ వీడియో పాతదే అయినా, ప్రస్తుతం సీజన్ అదే కావడంతో.. వైరల్ అవుతూ.. ఎన్టీఆర్ పేరును ట్రెండ్‌లోకి తెచ్చేసింది.
Also Read- Chiranjeevi – Nani: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!
ఈ వీడియోలో ‘తారక్ గురించి చెప్పండి అని అమల అక్కనేని (Amala Akkineni) అంటే.. తారక్ హలీమ్ బాగా చేస్తాడని అఖిల్ (Akhil) అంటే, చాలా బాగా చేస్తాడని శర్వానంద్ (Sharwanand) మాట కలిపారు. మరో సందర్భంలో రానా మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్ హలీమ్ స్పూన్‌తో తీసుకుని నోట్లో పెట్టుకోగానే కళ్లల్లో నీళ్లు వచ్చేశాయి. కబాబ్స్, హలీమ్ వంటివి తారక్ బాగా చేస్తాడంటూ వెంకటేష్, రానా చెబుతున్నారు’. అంతే, ఎన్టీఆర్‌లోని మల్టీ టాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. అసలు ఒక మనిషి ఎలా ఇలా? అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని లైక్స్, రీ ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
#JrNTR makes delicious Haleem – #Akhil & #Sharwanand
Haleem తినటం విన్నాం గాని Cook చెయ్యటం ఏంది సామి 🙏 pic.twitter.com/bHkpzcGi1p
— TollywoodRulz (@TollywoodRulz) March 12, 2025
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నిధి ఎవరంటే కచ్చితంగా అందరూ ఎన్టీఆర్ పేరే చెబుతారు. ధారాళంగా తెలుగు మాట్లాడాలన్నా.. పౌరాణిక, జానపద డైలాగ్స్ ఏవైనా సరే తారక్‌కు కొట్టిన పిండే. నటనలో శిఖరం, డ్యాన్స్‌లో ఎవరెస్ట్, వ్యక్తిత్వంలో మహాసముద్రం వంటి ఎన్నో ఆభరణాలు తారక్ సొంతం. అందుకే, ఆయనని అభిమానులు దేవుడిలా భావిస్తుంటారు. అభిమానులను కూడా తారక్ అలాగే చూస్తుంటారు. పాలిటిక్సా, సినిమానా? అంటే అభిమాన సంద్రాన్ని మెప్పించేందుకు సినిమానే చూజ్ చేసుకున్నాడీ ‘దేవర’. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ‘వార్ 2’తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తారక్.. మరో వైపు ‘దేవర 2’, ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ చిత్రాలను చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Mahesh – Rajamouli: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!
Soundarya Husband: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!