Men Stay Single (Image Source: Canva)
జాతీయం

Men Stay Single: పెరిగిన పెళ్లి కాని ప్రసాదులు.. ఇవే కారణమా?

Men Stay Single: ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది అతి ముఖ్యమైన ఘట్టం. కుటుంబ పరంగానే కాకుండా సామాజికంగానూ వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేశ భవిష్యత్తే పెళ్లిపై ఆధారపడి ఉంది. అటువంటి మ్యారేజ్ ను ప్రస్తుత యువత పెడచెవిన పెడుతోంది. పెళ్లి అన్న మాట చెప్పగానే ఏదో భూతాన్ని చూసినట్లు ఆమడ దూరం పరిగెడుతోంది. ఈ జనరేషన్ యూత్ లో వచ్చిన మార్పును ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియక అటు తల్లిదండ్రులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ యూత్ పెళ్లిని ఎందుకు దూరం పెడుతోంది? అందుకు గల కారణాలు ఏంటి? తెలియాలంటే ఈ ప్రత్యేక కథనాన్ని పూర్తిగా చదివేయండి.

కెరీర్ కు ప్రాధ్యాన్యత
ప్రస్తుత యువత పెళ్లి కంటే.. కెరీర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా పట్టణం, నగర ప్రాంతాలకు చెందిన యూత్.. చదువుతో పాటు కెరీర్ గ్రోత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. లక్ష్యాల వైపు పరిగెడుతూ ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లిని సైడ్ చేసేస్తున్నారు.

డేటింగ్ కల్చర్
ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే కనిపించిన డేటింగ్ కల్చర్.. ప్రస్తుతం భారత్ కు సైతం పాకేసింది. ప్రస్తుతం డేటింగ్ పేరుతో యువతీ యువకులు పెడదారిన పడుతున్నారు. సహజీవనం పేరుతో ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. తద్వారా పెళ్లిని పక్కనబెడుతున్నారు.

బాధ్యతల నుంచి ఎస్కేప్
పెళ్లి అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. అయితే వాటిని మోసేందుకు ఈ తరానికి చెందిన కొందరు యువతీ యువకులు సిద్ధపడట్లేదు. పెళ్లి అనేది తమ స్వేచ్ఛకు సంకెళ్లుగా వారు భావిస్తున్నారు. జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండలేమని ఇటీవల కొందరు యూత్ చేస్తున్న కామెంట్స్ కూడా నెట్టింటచ చూస్తూనే ఉన్నాం.

సంప్రదాయ పట్టింపులు
ట్రెడిషనల్ ఫ్యామిలీలకు చెందిన యువతీ, యువకులు.. తమ వర్గానికి చెందిన జీవిత భాగస్వామినే కోరుకుంటున్నారు. సామాజికంగా తమ స్థాయి ఏమాత్రం తగ్గకూడదని భావిస్తున్నారు. ఆస్తి పాస్తుల్లోనూ ఏమాత్రం లోటు ఉండకూడని కండిషన్స్ పెడుతున్నారు. ఈ కారణాల చేత కూడా కొందరు యూత్ తమ పెళ్లిలను వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు.

లైఫ్ స్టైల్స్ లో మార్పులు
ఎలాంటి భాగస్వామి కావాలో ఈ జనరేషన్ యూత్ ముందే ఓ క్లారిటీ వచ్చేసింది. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించడం, ఫ్రెండ్లీ నేచర్ ను కలిగి ఉండటం, తప్పులను పదే పదే ఎత్తిచూపకపోవడం, ట్రెండీ లైఫ్ స్టైల్ ను ఫాలో అయ్యే వారిని కొందరు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో అటువంటి వారు దొరికే వరకూ పెళ్లికి నో చెబుతున్నారు.

విడాకుల భయాలు
గతంతో పోలిస్తే ప్రస్తుతం విడాకులు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అది చూసి ఈ తరం యువతీ యువకులు ఆందోళన చెందుతున్నారు. వచ్చినవారిని చేసుకొని భవిష్యత్తులో విడాకులు తీసుకోవడం కన్నా.. నచ్చిన వ్యక్తి దొరికే వరకూ ఆగడం మంచిదని వారు భావిస్తున్నారు.

ప్రత్యక్ష అనుభవాలు
కొందరు యువతీ యువకులు.. తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వైవాహిక బంధంలోని అశాంతిని చూసి పెళ్లి వద్దనుకుంటున్నారు. తరచు గొడవలు పడటం, భాగస్వామిని పదే పదే తప్పుపట్టడం వంటివి తమ జీవితంలోనూ జరుగుతాయని వారు భయపడుతున్నారు. ఆ కారణం చేత పెళ్లికి అంగీకరించేందుకు వెనకడుగు వేస్తున్నారు.

Also Read: Revanth Reddy on KCR KTR: కేసీఆర్, కేటీఆర్.. మీ జాబ్స్ తీసేశా.. ఇక్కడ ఇచ్చేశా.. సీఎం రేవంత్ రెడ్డి

ఎమోషనల్ గా సిద్ధంగా లేకపోవడం
పెళ్లి అనేది రెండు మనసులతో ముడిపడే బంధం. వివాహం తర్వాత వచ్చే సంతోషం, సుఖంతో పాటు బాధలను కూడా ఎదుర్కొనేందుకు మానసిక దృఢత్వం అవసరం. అయితే అది తమలో లేనందున ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోమని కొందరు యువతీ యువకులు తల్లిదండ్రులకు చెప్పేస్తున్నారు. ఎమోషనల్ గా స్ట్రాంగ్ అయినప్పుడే పెళ్లి చేసుకుంటామని తేల్చి చెప్పేస్తున్నారు.

సోషల్ మీడియా ప్రభావం
టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ కు చెందిన కొద్ది మంది ఇన్ ఫ్లూయెన్సర్లు సింగిల్ లైఫ్ ఎంతో బెటరని తమ ఫాలోవర్స్ కు సూచిస్తున్నారు. సింగిల్ గా ట్రావెల్ చేస్తూ రెస్టారెంట్, పబ్ లకు తిరుగుతూ తాము జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తున్నామో తెలియజేస్తున్నారు. ఇది గమనించిన కొందరు ఈ జనరేషన్ యూత్.. పెళ్లితో అవన్నీ కోల్పోతామోనని భయపడుతోంది. కాబట్టి పెళ్లిని ఆమడ దూరం పెడుతోంది.

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు