Ostriches (Image Source: Canva)
జాతీయం

Ostriches: రాళ్లు తినే వింత పక్షి.. అసలు రహస్యం ఇదే!

Ostriches: ఈ భూ ప్రపంచంలో మనిషితో పాటు ఎన్నో జీవరాశులు, జంతువులు, జలచరాలు జీవిస్తున్నాయి. మనిషితో పోలిస్తే జంతువులు ఎంతో విభిన్నమని అందరికీ తెలిసిందే. శరీర నిర్మాణం, పరిస్థితులకు అనుగుణంగా మూగ జీవాలు తమకంటూ ప్రత్యేకమైన జీవనశైలిని అలవరుచుకున్నాయి. తమను తాము రూపాంతరం చేసుకున్నాయి. అలాంటి జంతువుల్లో ఆస్ట్రిచ్ పక్షి ఎంతో ముఖ్యమైనది. దాని జీర్ణ వ్యవస్థ.. మనుషులతో పాటు ఇతర జంతువులకు పూర్తి విభిన్నం. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షిగా కీర్తింప బడుతున్న ఆస్ట్రిచ్ (Ostriches) కు ఆహారం విషయంలో విభిన్నమైన పద్దతి ఉంది. అవి నేలపై ఉండే రాళ్లను సైతం పప్పుల్లా ఎంచెక్క ఆరగించేస్తుంటాయి. ఇంతకీ అవి రాళ్లను ఎందుకు తింటాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి.

రాళ్లను ఎందుకు తింటాయంటే..
ఆస్ట్రిచ్ పక్షులు ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి అని తెలిసిందే. తన ఎత్తు, బరువుకు తగ్గట్లు పెద్ద మెుత్తంలో ఆహారాన్ని సేవిస్తుంటుంది. ఈ క్రమంలోనే మనలాగే దానికి కూడా డైజేషన్ ప్రాబ్లం తలెత్తవచ్చు. కాబట్టి దాని నుంచి బయట పడేందుకు ఆస్ట్రిచ్ పక్షులు.. రాళ్లను తమ ఆహారంలో భాగం చేసుకుంటాయి. మిక్సీలు, గ్రైండర్లు తరహాలో ఆ రాళ్లను ఉపయోగించుకొని ఆహారాన్ని మెత్తగా చేసుకొని జీర్ణం చేసుకుంటాయి. ఆస్ట్రిచ్ తినే ఆహారాన్ని ఈ రాళ్లు.. చిన్న చిన్న పదార్థాలుగా విడగొట్టడంలో సాయపడతాయి. తద్వారా జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా తోడ్పాటు అందిస్తాయి.

ఆరోగ్యానికి కూడా మంచిదట
అస్ట్రిచ్ పక్షులు.. రాళ్లను తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపరుచుకోవడంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నాయి. ఈ రాళ్లు కడుపులోని pH విలువను సమతూల్యం చేస్తాయి. అంతేకాకుండా ఆస్ట్రిచ్ కు కావాల్సిన ఖనిజాలను సైతం అందిస్తాయి. రాళ్లల్లో ఉండే క్యాల్షియం ఆస్ట్రిచ్ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఆస్ట్రిచ్ కు కావాల్సిన ఫైబర్ కూడా ఈ రాళ్ల నుంచి లభిస్తుంది. అయితే ఆస్ట్రిచ్ పక్షులు.. నేరుగా రాళ్లను తినవని చెప్పవచ్చు. మెుక్కలు, పురుగులను తినే క్రమంలో వాటితో పాటు రాళ్లను కూడా ఆహారంగా తీసుకుంటాయి. అంతేగాని ఒట్టి రాళ్లను మాత్రం అవి భుజించవు.

Also Read: TGPSC Group 2 Results: నిరుద్యోగులకు బిగ్ అలెర్ట్.. ఫలితాలు వచ్చేశాయ్

ఆస్ట్రిచ్ గురించి ఈ విషయాలు తెలుసా?
అస్ట్రిచ్ పక్షుల శరీరల నిర్మాణం ఓ అద్భుతమని చెప్పవచ్చు. అవి 2.8 మీటర్ల (9.2 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతాయి. 156 కిలోల వరకూ బరువు తూగుతాయి. అస్ట్రిచ్ కాళ్లు ఎంతో దృఢమైనవి. చాలా పొడవుగా ఉన్నందున అది ఒక అడుగుతో 5 మీటర్ల (16 అడుగుల) దూరం కవర్ చేస్తుంది. ఇక ఆస్ట్రిచ్ ఒకసారి పరుగు అందుకుంటే దాన్ని పట్టుకోవడం అసాధ్యమనే చెప్పాలి. అది గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ కారణం చేతనే భూమిపైన అత్యంత వేగంగా పరిగెత్తే పక్షిగా ఆస్ట్రిచ్ ను చెబుతారు.

ఆస్ట్రిచ్.. జంతువులను తింటుందా?
ఆస్ట్రిచ్ తినే ఫుడ్ విషయానికి వస్తే.. అది విభిన్నమైన మెుక్కలు, పురుగులు, చిన్న చిన్న జంతువులను తింటుంది. ఇతర పక్షుల్లాగే గుడ్లను కూడా పెడుతుంది. ఆ గుడ్లు కూడా ఆస్ట్రిచ్ సైజ్ కు తగ్గట్లు చాలా పెద్దగా ఉంటాయి. ఇక ఈ ఆఫ్రికన్ పక్షులు గుంపులు గుంపులుగా జీవించేందుకు ఇష్టపడతాయి. 5-100 పక్షులు ఒక దగ్గరే పెరగడానికి ఆసక్తి చూపిస్తాయి. ఆస్ట్రిచ్.. మనుషుల్లాగే తమ పిల్లలను పెంచుకునేందుకు ఇష్టపడతాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆస్ట్రిచ్.. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. వాటిని కాపాడుకునేందుకు ప్రభుత్వాలు పలు రకాల చర్యలను చేపడతున్నాయి.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?