TGPSC Group 2 Results (Image Source: Canva)
తెలంగాణ

TGPSC Group 2 Results: నిరుద్యోగులకు బిగ్ అలెర్ట్.. ఫలితాలు వచ్చేశాయ్

TGPSC Group 2 Results: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన పరీక్షల తాలుకా ఫలితాలను తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ జాబితాతో పాటు ఫైనల్ కీని అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు తమ మార్కులను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఓఎంఆర్ షీట్లను సైతం వెబ్ సైట్ లో పొందవచ్చని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

రిజల్ట్స్ ఇలా చెక్ చేయండి..
గ్రూప్ 2 అభ్యర్థులు తమ ఫలితాలను tspsc.gov.in వెబ్ సైట్ లో పొందవచ్చు. ముందుగా ఆ వెబ్ సైట్ లోని హోమ్ పేజీకి వెళ్లాలి. అక్కడ గ్రూప్ 2 కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిజల్ట్ లింక్ ను క్లిక్ చేయాలి. అనంతరం మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు.

సగం మందే హాజరు
మెుత్తం 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలకాగా.. 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 ఆగస్టు 29, 30న పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ ప‌రీక్ష ప‌లుమార్లు వాయిదా పడి గత డిసెంబర్ 15, 16 తేదీల్లో ఎగ్జామ్ జరిగింది. 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది పరీక్ష రాశారు.

Also Read: Man Attacks on School: ఇదేం విచిత్రం.. డ్రైవర్ జాబ్ కోసం స్కూల్ పైనే బాంబు దాడి

మార్చిన 14న గ్రూప్-3 ఫలితాలు
తెలంగాణలో గ్రూప్స్ పరీక్ష రిజల్ట్స్ షెడ్యూల్ ను ఈ నెల 7న టీజీపీఎస్సీ ప్రకటించింది. మార్చి 10- 18 తేదీల మధ్య గ్రూప్‌-1, 2, 3 ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా మార్చి 10న గ్రూప్‌-1 ఫలితాలను విడుదల చేశారు. మంగళవారం గ్రూప్‌-2 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలోనే మార్చి 14న గ్రూప్‌-3 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను కూడా టీజీపీఎస్సీ‌ వెల్లడించనుంది. 17న హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, 19న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?