ప్రతి సర్కిల్‌లో 200 చోట్ల ఏర్పాటు
కుక్క కాట్ల నివారణ చర్యల్లో భాగంగా
తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీసీలకు ఆదేశం
Dogs: ఎండలు(Summer) మండిపోతున్నాయ్.. మున్ముందు మరింత మండే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు(metrology) హెచ్చరిస్తున్నారు. క్రమంగా గరిష్ట ఉష్ణోగ్రతలు(Temparature ) పెరుగుతుండటంతో మనుషులే అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత, వేడిమి(Heat) కారణంగా ఇక వీధి కుక్కల(Dogs) పరిస్థితి వర్ణణాతీతం. ఎండలు మండిపోతున్నపుడు సకాలంలో ఆహారం(Food) లభించక, తాగునీరు(Water) దొరక్క కుక్కలు ఇరిటేట్ అయినపుడే మనుషులపై దాడులకు దిగుతున్నాయని గుర్తించిన జీహెచ్ఎంసీ(GHMC) ఈ సారి కుక్క కాట్ల నివారణకు ముందస్తు(preventive)గా స్పందించింది. ఎండలు మండిపోతున్నపుడు కుక్కలు హెరిటేట్ కాకుండా ఉండేలా వాటికి తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు జీహెచ్ఎంసీలోని ప్రతి సర్కిల్‌లో 200 వాటర్ పాయింట్ల(Water Points)ను ఏర్పాటు చేయాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. రెండేళ్ల క్రితం అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌పై కుక్కుల గుంపు దాడి చేసి, తీవ్రంగా గాయపర్చగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆ బాలుడు మృతి చెందిన ఘటనపై గుణపాఠాలు నేర్చుకున్న జీహెచ్ఎంసీ కుక్కలు వేసవికాలంలోనే ఎందుకు దాడులకు పాల్పడుతున్నాయన్న విషయంపై స్టడీ చేసి కారణాలు గుర్తించింది. గత సంవత్సరం వేసవిలో ప్రతి సర్కిల్‌కు వంద వాటర్ పాయింట్లు చొప్పున గ్రేటర్‌లోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో 3 వేల వాటర్ పాయింట్లను ఏర్పాటు చేయగా, ఈ సారి ఆ వాటర్ పాయింట్ల సంఖ్యను రెండింతలు చేస్తూ సర్కిల్‌కు 200 వాటర్ పాయింట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలంటూ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి
ఎండలు మండిపోతున్న సమయంలో మూగ జీవాలైన కుక్కలకు కనీసం తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రతి సర్కిల్‌లో 200 వాటర్ పాయింట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వాటర్ పాయింట్లను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా పాఠశాలల(Schools)కు సమీపంలో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. దీంతో పాటు మటన్, చికెన్ షాపుల(Meat Shops)కు సమీపంలో, డంపింగ్ యార్డు(Dumping Yards)లు, చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలతో పాటు మ్యారేజ్‌హాళ్లు, ఫంక్షన్‌హాల్స్(Function Halls) వంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ వాటర్ పాయింట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.
పాయింట్ల ఏర్పాటులో పారదర్శకత కోసం
మూగజీవాల కోసం ఏర్పాటు చేయనున్న వాటర్ పాయింట్ల విషయంలో జీహెచ్ఎంసీ కాస్త పకడ్బందీగానే వ్యవహరిస్తున్నదని చెప్పవచ్చు. ప్రతి సర్కిల్‌లోని వెటర్నరీ సెక్షన్ సిబ్బంది(veterinary Department Team) ఈ వాటర్ పాయింట్లను ఏర్పాటు చేసి, దాని ఫొటో తీసి, వెటర్నరీ స్టాఫ్‌కు సర్కిల్, జోన్ల వారీగా ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్‌లలో పెట్టాలని ఖచ్చితమైన ఆదేశాలున్నట్లు సమాచారం. వీటిని ఏర్పాటు చేయటమే గాక, వాటిలో నీరు అయిపోగానే వెంటనే నింపాలని కూడా ఆదేశాలున్నాయి. సర్కిళ్ల వారీగా వాటర్ పాయింట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు సర్కిల్ లెవెల్‌లో పని చేస్తున్న వెటర్నరీ సిబ్బందిని డిప్యూటీ కమిషనర్లు, స్థానిక వెటర్నరీ ఆఫీసర్లు గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రతి రోజు స్కూల్ టైమ్‌లో ఈ వాటర్ పాయింట్ల వద్ద సిబ్బంది విధులు నిర్వర్తించాలని కూడా సర్కిల్ స్థాయిలో అధికారులు సిబ్బందికి మౌఖిక ఆదేశాలిస్తున్నట్లు సమాచారం.