Air India: ముంబయి నుంచి అమెరికా బయలుదేరిన ఎయిరిండియా విమానం (Air India Airlines) అకస్మికంగా ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. టైకాఫ్ అయిన చోటే పైలెట్లు తిరిగి విమానాన్ని దించేశారు. ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులందరూ గందరగోళానికి గురయ్యారు. అయితే విమానం గగనతలంగో ఉండగా బెదిరింపులు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెంటనే ముంబయికి వైపు మళ్లించినట్లు తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే..
ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 విమానం.. సోమవారం ఉ. 10.25 గంటల ప్రాంతంలో ముంబయి నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు పయనమైంది. మెుత్తం 303 ప్రయాణికులతో పాటు 19 మంది సిబ్బందితో ఫ్లైట్ గగనతలంలోకి ఎగిరింది. నాలుగు గంటల తర్వాత అజర్‌బైజాన్ ప్రాంతంలో గగనతలంలో ఉండగా విమానానికి బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు.. ప్రోటోకాల్ ప్రకారం ఫ్లైట్ ను వెంటనే వెనక్కి మళ్లించారు. ముంబయి విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.
ఎయిరిండియా స్పందన ఇదే
దీంతో వెంటనే ప్రయాణికులను హుటాహుటీనా ఫ్లైట్ నుంచి సిబ్బంది దించేశారు. అప్పటికే సిద్దంగా ఉన్న బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని పరిశీలిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికుల అసౌఖర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ఫ్లైట్ తిరిగి మంగళవారం ఉ.5 గం.లకు టేకాఫ్ అవుతుందని ఎయిర్ లైన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. అప్పటివరకూ ప్రయాణికుల ఆహారం, వసతి బాధ్యతలను తాము తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు భద్రతకు ఎయిరిండియా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన మరోమారు తెలియజేశారు.
Also Read: AP Assembly: ‘ఆడుదాం ఆంధ్రాలో రూ.400 కోట్ల స్కామ్’.. రోజా అరెస్టు ఖాయమైందా?
ఆకతాయిలు చేశారా?
ఇటీవల కాలంలో విమానాలకు బెదిరింపులు రావడం సర్వ సాధారణంగా మారిపోయింది. గతంలో కొందరు ఆకతాయిలు మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా విమానాలను బెదిరించి ప్రయాణాలకు ఇబ్బందులు సృష్టించారు. ఈ క్రమంలోనే ఎయిరిండియా విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. బెదిరింపులకు సంబంధించి ఎయిరిండియా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.