Ap Assembly
ఆంధ్రప్రదేశ్

AP Assembly: ‘ఆడుదాం ఆంధ్రాలో రూ.400 కోట్ల స్కామ్’.. రోజా అరెస్టు ఖాయమైందా?

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ‘ఆడుదాం ఆంధ్ర’పై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గత వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద క్రీడాకారుల భవిష్యత్తుతో గత ప్రభుత్వం ఆడుకుందని పేర్కొన్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’లో అవినీతి జరిగిందని ధ్రువీకరించిన మంత్రి.. దానిపై మాట్లాడాలంటేనే క్రీడా మంత్రిగా తనకే సిగ్గుగా ఉందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. త్వరలోనే దోషుల పేర్లను బయట పెడతామని అసెంబ్లీ వేదికగా ఆయన హామీ ఇచ్చారు.

దేనికి ఎంత ఖర్చు చేశారంటే

‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి గత ప్రభుత్వం రూ.119.19కోట్లు కేటాయించిందని మంత్రి అన్నారు. ఆ నిధుల్లో రూ.119.11 కోట్లను ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని R & B, స్పోర్ట్ శాఖ, జిల్లా కలెక్టర్ల ద్వారా చెల్లింపులు జరిపినట్లు స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కిట్‌ల కోసం రూ.38.55 కోట్లు, టీషర్ట్స్-క్యాప్‌ల కోసం రూ.34.2 కోట్లు, జిల్లా కలెక్టర్ల స్పోర్ట్స్ అకౌంట్స్‌కు రూ.40.93 కోట్లు, ప్రైజ్ మనీ కోసం రూ.12.21 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆ డబ్బంతా కేవలం 41 రోజుల్లోనే ఖర్చు చేసినట్లు అసెంబ్లీకి మంత్రి తెలియజేశారు. ‘ఆడుదాం ఆంధ్ర’లో నిధుల దుర్వినియోగం సుస్పష్టమన్న మంత్రి.. ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. దోషుల పేర్లను త్వరలో బయటపెడతామని.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

అంతకుముందు సభలో ఇదే విషయంపై మాట్లాడిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమన అఖిల ప్రియ.. వైసీపీ నేత రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. ఫుడ్ బాల్ కు వాలీబాల్ కు తేడా తెలియని గత మంత్రి.. రూ.120 కోట్లతో ఆటలు ఆడించారని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం రూ.35 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. లెక్కల్లో చెబుతున్నట్లు రూ.12 కోట్ల నిధులు గెలిచిన క్రీడాకారుల ఖాతాల్లోకి వెళ్లలేదని ఆమె సభలో పేర్కొన్నారు. మెుత్తంగా ‘ఆడుదాం ఆంధ్ర’ చుట్టూ రూ.400 కోట్ల స్కామ్ జరిగినట్లు సభలో సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రీడల కోసం జిల్లాలకు సంబంధించిన నిధులను సైతం వాడేశారని ఆరోపించారు.

Also Read: MLC Elections: సస్పెన్స్ కు బ్రేక్.. ఆ నేతకే జై కొట్టిన ఏపీ బీజేపీ

రోజా మెడకు ఉచ్చు!

గత ప్రభుత్వంలో ఆర్కే రోజా (RK Roja) క్రీడల మంత్రిగా ఉన్న సమయంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా పనిచేసిన వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ కార్యక్రమం నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఆడుదాం ఆంధ్రా పేరుతో అప్పటి మంత్రి రోజా పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని అధికారంలోకి రాకముందు నుంచే టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం దీనిపై పలుమార్లు విమర్శలు చేసింది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీలోనే చర్చకు తీసుకురావడం, అవినీతి జరిగిందని సంబంధిత శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్రువీకరించడంతో మాజీ మంత్రి రోజా అరెస్టు కాక తప్పదన్న సంకేతాలు రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం.. త్వరలోనే ఆడుదాం ఆంధ్రా స్కామ్ కు సంబంధించి రోజాను కూడా అరెస్టు చేయవచ్చని పలువురు భావిస్తున్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ