Syria Civil War: సిరియా(Syria)లో అంతర్యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. గత 2 రోజులుగా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్(Bashar al Assad) మద్దతుదారులు(Supporters), ప్రభుత్వ భద్రతా దళాల(Security Forces) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 1000 మందికి పైగా మృతి(1000 people Died) చెందారు. ఇందులో 750 మంది దాకా పౌరులున్నట్లు అంచనా. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని పేర్కొంటున్నారు. అసద్ మద్దతుదారులు ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులు చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ప్రతిదాడి చేయడం మొదలుపెట్టడంతో హింస తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా మృతి చెందారు. చనిపోయిన వారిలో 150 మంది దాకా అసద్ మద్దతుదారులు ఉన్నట్లు స్థానిక మీడియా ద్వారా తెలస్తోంది.
అసలేం జరిగిందంటే…
సిరియాను 2011 నుంచి బషర్ అల్ అసద్ పాలిస్తున్నాడు. అప్పటి నుంచి అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ లో తిరుగుబాటుదారులు సిరియా ను ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో అసద్ తన కుటుంబంతో సహా రష్యా(Russia)కు పారిపోయాడు. అనంతరం.. తిరుగుబాటుదారులు డమాస్కస్(damascus)లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని అసద్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు.
ఇక, తాజాగా చెలరేగిన హింసకు రెండు, మూడు రోజుల క్రితం జరిగిన పరిణామాలే కారణం. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్… అలావైట్ల తెగకు చెందిన వాడు. కాబట్టి ప్రస్తుతం ఆయన మద్దతు దారులు కూడ వాళ్లే. కాగా, గురువారం నాడు అసద్ మద్దతు దారులు.. జాబ్లే(Jableh) అనే నగరంలో భద్రతా సిబ్బందిని చంపేయడంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దానికి ప్రతికారంగా…శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీస్థాయిలో అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించి భీకర దాడులకు పాల్పడ్డాయి. అలావైట్లను ఊచకోత కోసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అక్కడి వీధుల్లో రక్తపు టేరులు ప్రవహిస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.