Bandla Ganesh About Teenmaar Re Release: ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. రీ రిలీజ్‌లోనూ కలెక్షన్ల సునామీ వస్తుండటంతో కొన్ని క్లాసిక్ చిత్రాలను మేకర్స్ రీ రిలీజ్‌కు తెస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ (Orange) సినిమా ఫస్ట్ విడుదలైనప్పుడు భారీ డిజాస్టర్ అయింది. కానీ, రీ రిలీజ్‌లో మాత్రం సంచలనాలను క్రియేట్ చేసింది. ఇప్పటికే రెండు సార్లు రీ రిలీజ్ అయినా, రెండు సార్లూ అద్భుతంగా థియేటర్లలో రెస్పాన్స్‌ని రాబట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు నటించిన చిత్రాలు రీ రిలీజ్‌లోనూ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ప్రజంట్ వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన క్లాసిక్ ఫిల్మ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజై షాకింగ్ కలెక్షన్లను రాబడుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొందరు బండ్ల గణేష్‌కు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
Also Read- Robinhood: స్పెషల్ సాంగ్‌లో కేతికా.. గ్లామర్ బ్యూటీకి కలిసొచ్చేనా?
‘‘అన్నా.. ఏం చేస్తావో తెలియదు మాకు ‘తీన్‌మార్’ రీ రిలీజ్ కావాలి’’ అని ఓ నెటిజన్ బండ్ల గణేష్‌కు ట్యాగ్ చేయగా, ‘నేను రిలీజ్ చేస్తాను బ్రదర్.. మీరు బ్లాక్‌బస్టర్ చేస్తారా?’ అంటూ ప్రశ్నించారు బ్లాక్‌బస్టర్ నిర్మాత. దీనికి మరో నెటిజన్.. ‘పార్టీకి డొనేషన్ ఏమైనా ఇస్తానంటే బ్లాక్‌బస్టర్ చేస్తాం’ అని ట్వీట్ చేయగా, ‘మూవీ రీ రిలీజ‌్‌కి వచ్చిన మనీ మొత్తం పార్టీకే ఇస్తాను’ అని బండ్ల గణేష్ సమాధానమిచ్చారు. దీనికి మరో నెటిజన్, ‘రిలీజ్ చెయ్ కానీ డబ్బింగ్ సరి చేసి చెయ్యి’ అని ట్వీట్ చేశాడు. దీనికి సమాధానమిస్తూ.. ‘డబ్బింగ్, సౌండింగ్ అద్భుతంగా రెడీ చేసిన తర్వాత రీ రిలీజ్ చేస్తాను’ అని సమాధానం ఇచ్చారు. బండ్ల గణేష్ ఇస్తున్న ఈ సమాధానాలకు ఇంకా నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘మంచి డేట్ చూసి త్వరగా రిలీజ్ చెయ్’ అంటూ అడుగుతూనే ఉన్నారు. ఈ కామెంట్స్‌తో ప్రస్తుతం బండ్ల ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

‘తీన్‌మార్’ (Teenmaar) విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌లోనే ఓ వైవిధ్యభరిత రొమాంటిక్ డ్రామా చిత్రంగా ఈ సినిమా వచ్చింది. లైవ్ డబ్బింగ్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సరైన విజయాన్ని అందుకోలేదు. ముఖ్యంగా ఆ లైవ్ డబ్బింగ్, సౌండింగ్ ఈ సినిమాకు మైనస్‌గా మారాయి. ‘లవ్ ఆజ్ కల్’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వహించగా.. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అందించారు. పవన్ కళ్యాణ్ రెండు వైవిధ్యమైన పాత్రలలో నటించిన ఈ సినిమాలో త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటులు పరేష్ రావేల్, సోనూ సూద్, ముఖేష్ రుషి వంటి వారు ఇతర పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
Niharika Konidela : భర్తతో విడిపోవడంపై నిహారిక కామెంట్స్ వైరల్
Janhvi Kapoor: ఆర్‌సి 16, దేవర.. జాన్వీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్ అదిరాయ్..