Chiranjeevi Womens Day Wishes: మెగాస్టార్ చిరంజీవి నుంచి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు వచ్చేశాయి. మహిళల పట్ల చిరంజీవి చూపించే ప్రేమ, అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో తన తల్లిని, భార్యని, చెల్లెళ్లని, అభిమానించే వారి పట్ల ఆయన ఎలా ఉంటారో కథకథలుగా సోషల్ మీడియాలో ఎప్పుడూ వినిపిస్తూ, కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందో అని, పెళ్లి చేసి పంపించిన తర్వాత తోబుట్టువులను పట్టించుకోని సమాజంలో.. ‘రక్షాబంధన్’ రోజు కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని తన చెల్లెళ్లకి మెగాస్టార్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఏ చిన్న వేడుక అయినా సరే, ఇప్పటికీ అందరినీ ఒకచోటకి చేర్చి, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇక ఆయనతో నటించిన నటీమణులు అయితే, చిరు తమ సొంతం అన్నట్లుగా డైరెక్ట్‌గా ఇంటికెళ్లి సొంత మనుషుల్లా కలిసిపోతుంటారు. అంతగా మహిళల పట్ల చిరు వాత్సల్యం ప్రదర్శిస్తుంటారు.
Also Read- Robinhood: స్పెషల్ సాంగ్‌లో కేతికా.. గ్లామర్ బ్యూటీకి కలిసొచ్చేనా?
అలాంటి చిరంజీవి ఈ మధ్య ఓ వేడుకలో సరదాగా ఆడపిల్లలపై చేసిన కామెంట్, పెద్ద దుమారాన్నే రేపింది. ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారు. ఈసారైనా చరణ్‌ని ఒక బాబుని ఇవ్వమని అడుగుతున్నాను. ఇంట్లో ఆడపిల్లల మధ్య ఉంటే హాస్టల్ వార్డెన్‌లా ఉన్నానంటూ, ఆ వేడుకలో ఓ సందర్భంలో చిరు సరదాగా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత తన ఇంట్లోని ఆడపిల్లలందరూ వండర్ ఫుల్ గాళ్స్ అంటూ కొనియాడారు. ఆ కొనియాడిన మాటని పక్కన పెట్టి.. ఆడపిల్ల వద్దంటున్న చిరు, ఆడపిల్లలని అవమానించిన చిరు అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ చేశారు. చిరంజీవి ఉద్దేశ్యంలో ఆడవాళ్లని అవమానించాలనే కోణం ఏ కోశానా లేదు. కానీ ఆయన ఏం మాట్లాడినా, దానిని భూతద్దంలో చూపించడానికి ఈ మధ్య ఓ బ్యాచ్ తయారైంది. వారే, కావాలని రిపీటెడ్ మోడ్‌లో చిరు వ్యాఖ్యలను వైరల్ చేస్తూ వచ్చారు. కానీ, చిరంజీవి ఉద్దేశ్యం తెలిసిన వారంతా ఆ బ్యాచ్‌కి కౌంటర్ ఇచ్చారనుకోండి.. అది వేరే విషయం.
నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన
నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ
మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు. 💐🙏#HappyWomensDay pic.twitter.com/j5qtSrtIAC— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2025
ఇక విషయంలోకి వస్తే.. ‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..’’ అని (Happy Womens Day) మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా తన భార్య, తనతో పాటు సినిమాలలో నటించిన హీరోయిన్లు ఉన్న ఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోలో చిరు, సురేఖ దంపతులతో ఖుష్బూ, నదియా, రాధిక, సుహాసిని, మీనా, జయసుధ, టబు ఉన్నారు. వారంతా నవ్వుతూ ఫొటోకి ఫోజులిస్తున్నారు. ఇక చిరు చేసిన ఈ పోస్ట్‌కి కామెంట్స్ కూడా ఓ రేంజ్‌లో పడుతున్నాయి. రోజా, నగ్మా, సుమలత, రమ్యకృష్ణ, భానుప్రియ, విజయశాంతి వంటి వారంతా మిస్ అయ్యారు అంటూ చిరు హీరోయిన్ల లిస్ట్‌ని నెటిజన్లు బయటికి తీస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
Niharika Konidela : భర్తతో విడిపోవడంపై నిహారిక కామెంట్స్ వైరల్
Janhvi Kapoor: ఆర్‌సి 16, దేవర.. జాన్వీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్ అదిరాయ్..