Happy Womens Day
ఎంటర్‌టైన్మెంట్

Happy Womens Day: ఓ మహిళా నీకు కంఫర్ట్ ఎ క డ?

Happy Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు. ఈ సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ. ఆమె గొప్పతనాన్ని చెప్పడానికి ఈ సృష్టిలోనే ఏవీ సరిపోవు. మానవ జీవన మనుగడకు కారణం మహిళ. అటువంటి మహిళ నేడు పురుషునితో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ఆడపిల్లల్ని పురిటిలోనే చిదిమేసే దారుణాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే, మహిళలకు దక్కాల్సిన స్థానం దక్కడం లేదనే చెప్పుకోవాలి. హీరో డామినేషన్ ఇండస్ట్రీ ఇది. ఇక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఎందరో ఉన్నారు. మరోవైపు మీటూ ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. అవకాశం కావాలంటే కమిట్‌మెంట్ కంపల్సరీ అనే లెక్కల్లో మార్పు రావడం లేదు. వీటన్నింటిని ఎదుర్కొంటూ నటిగా అగ్రస్థానం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలిక కానే కాదు.

Also Read- Robinhood: స్పెషల్ సాంగ్‌లో కేతికా.. గ్లామర్ బ్యూటీకి కలిసొచ్చేనా?

ఈ మధ్య నటీమణులు వారి ఇంటర్వ్యూల్లో షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. ఎంత గ్లామర్ ఇండస్ట్రీ అయినప్పటికీ ప్రతి మహిళకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. దానిని కూడా హరించాలని చూసే వారు రోజురోజుకు ఇండస్ట్రీలో ఎక్కువైపోతున్నారు. నిన్నటికి నిన్న నాకు కంఫర్ట్‌గా లేదు, ఫొటోలు తీయకండి అని ఓ నటి స్టేజ్ మీద చెప్పుకోవాల్సి వచ్చింది. ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియాలో వేదన చెప్పుకునే ఓ నటి. ఇలా ఒక్కటేమిటి? ఎన్నో సంఘటనలు. ఎంతోమంది సెలబ్రిటీలు. ఇవన్నీ చూడలేక ఎదిరిస్తే, ఇండస్ట్రీలో లేకుండా చేస్తాం.. తెలుగు అమ్మాయిలను ఇకపై ప్రోత్సహించం వంటి సూటిపోటి మాటలు. ఇండస్ట్రీలోని 24 శాఖల్లోనూ మహిళలు ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉన్నారు. హేమ కమిటీలు ఎన్ని వచ్చినా, ప్రభుత్వాలు ఎన్ని కమిటీలు వేసినా.. జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి.

ఇవన్నీ కాదన్నట్లు ఇప్పుడు కొత్తగా డీప్ ఫేక్ అంటూ మహిళలను గందరగోళానికి గురి చేస్తున్న టెక్నాలజీ. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎందరో ఈ డీప్ ఫేక్ బారిన పడుతున్నారు. ఆ వీడియోలలో, ఫొటోలలో ఉంది మేము కాదు అని వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందంటే, ఎంతగా ఈ టెక్నాలజీ వారిని హర్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి చోటా మహిళ ఇబ్బందులు పడుతూనే ఉంది. మహిళలను ఎంకరేజ్ చేసే వారికంటే, డిస్కరేజ్ చేసే వారే ఎక్కువ. అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తున్న వేళ, ఇంకా మహిళను తక్కువగా చూసే కోణం ఎప్పుడు మారుతుందో? వీటన్నింటి మధ్య మహిళకు కంఫర్ట్ ఎ క డ? మార్పు వచ్చేది ఎప్పుడో? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కరోజే కాదు.. మహిళను ప్రతి రోజు గౌరవించే రోజు ఎప్పటికి వస్తుందో.. (International Women’s Day)

ఇవి కూడా చదవండి:
Niharika Konidela : భ‌ర్తతో విడిపోవ‌డంపై నిహారిక‌ కామెంట్స్ వైరల్

Janhvi Kapoor: ఆర్‌సి 16, దేవర.. జాన్వీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్ అదిరాయ్..

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్