Woman Strips Naked: విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బరితెగించి ప్రవర్తించింది. అందరూ చూస్తుండగానే బట్టలు విప్పి తోటి ప్రయాణికులను షాక్ కు గురి చేసింది. బిగ్గరగా అరుస్తూ ఫ్లైట్ లో అటు ఇటు తిరిగింది. విమానం 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా తనను వెంటనే దింపేయాలంటూ రచ్చ రచ్చ చేసింది. మహిళ విచిత్ర ప్రవర్తన చూసి తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
విమాన తలుపులు తెరిచేందుకు యత్నం
హ్యూస్టన్ లోని విలియం పి. హబీ విమానశ్రయం నుంచి ఫినిక్స్ వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ కొద్ది నిమిషాలకే మహిళ వీరంగం సృష్టించడం మెుదలుపెట్టింది. నగ్నంగా తిరుగుతూ విమానాన్ని ఆపాలని కేకలు వేసింది. అంతటితో ఆగకుండా కాక్ పీట్ తలుపులను తెరిచేందుకు యత్నించి అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. విమానంలో రన్నింగ్ లో ఉండగానే కాక్ పీట్ డోర్ ను తెరిచేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెను అడ్డుకోబోయారు.
🚨Nude Runner Grounds Southwest Flight:
SWA Flight WN733 from Houston to Phoenix delayed after a woman stripped naked, ran down the aisle screaming for 25 mins. Plane returned to gate; she was removed for psych eval. No charges filed. Flight took off over an hour late. pic.twitter.com/FszM47RlaF— X Global Update (@XGlobalUpdate) March 7, 2025
దుప్పటి చుట్టి బలవంతంగా
తనను నిలువరించేందుకు వచ్చిన విమాన సిబ్బందితోనూ ఆమె వాగ్వాదానికి దిగింది. బట్టలు ధరించి సీటులో కూర్చోవాలన్న సూచనలు తిరస్కరించి మరింత వీరంగం సృష్టించింది. దీంతో చేసేదేమి లేక పైలెట్లు.. విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించారు. అప్పటికే హ్యూస్టన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విమానం ల్యాండ్ కాగానే వారు ఫ్లైట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. విమాన సిబ్బంది, పోలీసులు కలసి సదరు మహిళకు దుప్పటి కప్పి ఫ్లైట్ నుంచి ఫ్లైట్ నుంచి బలవంతంగా దించేశారు.
Read Also: Swiggy Food Delivery: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 100 స్టేషన్లలో స్విగ్గీ సేవలు
సారీ చెప్పిన ఎయిర్ లైన్స్
మహిళ విచిత్ర ప్రవర్తన కారణంగా విమాన ప్రయాణికులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏం జరుగుతుందో అర్థం గాక భయంభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్.. విమాన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. మరోవైపు ప్రయాణికులు సైతం ఈ భయానక అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.