Hardik Pandya Should Think Like MS Dhoni
స్పోర్ట్స్

Sports News: హార్దిక్, ధోనీలా ఆలోచించు, ఇజ్జతేం పోలేదు: మాజీ క్రికెటర్

Hardik Pandya Should Think Like MS Dhoni: ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్య పుల్‌ డిప్రెషన్‌లో పడ్డాడు. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రోహిత్ శర్మకు బదులుగా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న హార్దిక్. ఈ సీజన్‌లో ఇంకా బోణీనే కొట్టలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లో జట్టును విజయ అంచులకు చేర్చలేకపోయాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున సారథి బాధ్యతలు నిర్వర్తించిన ప్రారంభంలో హార్దిక్ హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. కానీ ఇప్పుడు ముంబై తరఫున హ్యాట్రిక్ ఓటములు నమోదు చేయడం గమనార్హం.

మరోవైపు ఐపీఎల్ ప్రారంభమైన నుంచి రోహిత్ ఫ్యాన్స్‌ హార్దిక్ పట్ల వ్యతిరేకత చూపుతున్నారు. అతడు టాస్‌కు వచ్చే టైంలో ‘రోహిత్ రోహిత్’ నినాదాలతో హేళన చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కూడా ఆడియెన్స్‌పై ఫైర్‌ అయ్యాడు. ఢిసిప్లేన్డ్‌గా ఉండాలని వారికి సూచించాడు. అయితే ఈ విషయాలన్ని పట్టించుకోకుండా హార్దిక్ ముంబై జట్టు కూర్పు గురించి ఆలోచించాలని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నాడు.ఓటమికి గల రీజన్స్‌ ఏంటో విశ్లేషించుకుంటూ జట్టు బలోపేతంగా మారడానికి ప్రయత్నించాలని సిద్ధూ అన్నాడు. ముంబై జట్టు పరాజయాల్ని మాత్రమే చవిచూసిందని, పరువు పోయేలా ఏం ఆడలేదని అన్నాడు. తమ అభిమాన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఫ్రాంచైజీకి కెప్టెన్ కాలేకపోయాడని విషయాన్ని రోహిత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. అతడు చేసిన తప్పేంటనే ఆలోచిస్తారు. అయితే విజయాలతో వివాదానికి ముగింపు లభిస్తుంది.

Read Also: కోహ్లీపై మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబై ఇండియన్స్ గత రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే ప్రతి ఒక్కరూ సైలెంట్‌గా ఉండేవారు. అయితే హార్దిక్ పాండ్య జట్టు కూర్పు గురించి ఆలోచించాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో 277 పరుగులు ఇచ్చినప్పుడు బౌలింగ్ బాగా లేదని అందరూ విమర్శించారు. ఐపీఎల్‌ వంటి టోర్నీలో అన్ని రన్స్‌ ఎలా సాధ్యమని అన్నారు. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయానికి దగ్గరగా వచ్చి ఓడింది. కాబట్టి వాళ్లు ఓటమిపాలయ్యారంతే పరువు పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ ఏం చేస్తాడో ఆలోచించాలి. గత సీజన్‌లో తమ లీడింగ్ రన్ స్కోరర్ డెవాన్ కాన్వే గాయంతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. ఆ స్థానంలో కాన్వేకు తగ్గట్లుగా రచిన్ రవీంద్రతో భర్తీచేశారు. హార్దిక్ పాండ్య కూడా ఇలాంటి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడని నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!