Dilruba: ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో విక్టరీ వెంకటేష్ అందరికీ ఓ మెసేజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పొరపాటున కూడా మీ భార్యతో మీకున్న ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పవద్దని, ఆమెతో షేర్ చేసుకున్న మూమెంట్స్ కనుక భార్యకి చెప్పారో.. ఇక అంతే. మీకు నరకమే అనేలా? వెంకీమామ చెబితే.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఇంకోలా చెబుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆయన నటించిన ‘దిల్ రూబా’ చిత్రాన్ని ఎక్స్ లవర్‌తో కలిసి చూడమంటున్నాడు. ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ గురించి ఇందులో ఒక క్యూట్ ఎమోషన్ ఉంటుందని, వీలైతే మీ ఎక్స్ లవర్‌తో కలిసి ఈ సినిమాను చూడండి అంటూ, తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడిదే అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. స్టార్ హీరో వెంకటేష్ (Victory Venkatesh) చెప్పింది చేయాలా? లేక కుర్ర హీరో కిరణ్ అబ్బవరం చెబుతుంది చేయాలా? అయినా, ఎక్స్ లవర్‌ని తీసుకుని సినిమాకి వెళ్లే ఛాన్స్ ఎంత మందికి ఉంటుంది? ఎవరు ఒప్పుకుంటారు.. అలా సినిమాకు రావడానికి? కిరణ్ ఇలా చేశావేంటి? అంటూ కొందరు నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read- Robinhood: స్పెషల్ సాంగ్‌లో కేతికా.. గ్లామర్ బ్యూటీకి కలిసొచ్చేనా?
‘క’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) చేస్తున్న సినిమా ‘దిల్ రూబా’. కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ సంస్థకు చెందిన ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14న హోలీ పండుగ స్పెషల్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. గురువారం ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందం మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..
March 14th Kaluddam 🙂 #Dilruba pic.twitter.com/vOSkFqmgkZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 6, 2025
‘‘ప్రేమ గురించి ఒక యాంగిల్‌ని ఈ సినిమాలో చూపించాం. ‘దిల్ రూబా’ నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్‌కు మీరు ఆదరిస్తున్న తీరుకు చాలా సంతోషంగా ఉంది. టీజర్, సాంగ్స్.. ఇలా అన్నింటిని ఆదరిస్తూ. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. లవ్ బ్రేకప్ అయిన తర్వాత లవర్ నుంచి దూరంగా ఉంటూ, వారిని శత్రువులా చూస్తాం. కానీ, ఈ సినిమా చూశాక మీ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. ఇందులో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌పై ఒక క్యూట్ ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎక్స్ లవర్ కామన్. మీకు వీలైతే ఈ సినిమాను మీ ఎక్స్ లవర్‌తో కలిసి చూడండి. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫీలింగ్‌తో వస్తారు. ఈ సినిమా విషయంలో మా ప్రొడ్యూసర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన దాదాపు 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ఆయన స్ట్రగుల్ చూశాక నిజంగా నాకు డిస్ట్రిబ్యూటర్స్‌పై గౌరవం పెరిగింది. ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నారు. మూడేళ్లుగా ఈ సినిమాను ప్రేక్షకులకు ది బెస్ట్‌గా ఇచ్చేందుకు ట్రై చేస్తూనే ఉన్నారు. మార్చి 14న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. పరీక్షల టైమ్, ఐపీఎల్ రాబోతోంది కాబట్టి మా అందరికీ కాస్త టెన్షన్‌గానే ఉంది. అయినా నేను చెప్పేది ఏమిటంటే.. ఫస్ట్ స్టూడెంట్స్ పరీక్షలు బాగా రాయండి, ఆ తర్వాత మా మూవీ చూడండి. ప్రస్తుతం ఎగ్జామ్స్ రాయబోతున్న వారందరికీ మా టీమ్ తరపున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఈ హోలీ పండుగను ‘దిల్ రుబా’ థియేటర్స్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం. ఇందులోని మ్యాజికల్ మూమెంట్స్‌ను థియేటర్లో ఎంజాయ్ చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Niharika Konidela : భర్తతో విడిపోవడంపై నిహారిక కామెంట్స్ వైరల్
Janhvi Kapoor: ఆర్‌సి 16, దేవర.. జాన్వీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్ అదిరాయ్..