Ys Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న(Watchmen Ranganna) మృతి చెందారు. కొంతకాలంగా కడప రిమ్స్(RIMS)లో చికిత్స పొందుతున్నఆయన.. బుధవారం కన్నుమూశారు. 85 ఏళ్ల రంగన్న చాలా కాలంగా వృద్దాప్య సమస్యలతో భాదపడుతున్నారు. ఇవాళ మద్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా, వివేకానందా రెడ్డి ఇంట్లో రంగన్న చాలా ఏళ్లుగా పనిచేశారు.
2019 మార్చి 15న పులివెందులలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో వివేకా ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేసిన రంగన్న సీబీఐ(CBI)కి వాంగ్మూలం ఇస్తూ పలు కీలక అంశాలు బయటపెట్టారు. హత్య కేసులో కీలక సాక్షిగా నమోదు చేసిన సీబీఐ ఛార్జిషీట్‌లో సైతం పలు అంశాలు పేర్కొంది.
ఆరు సంవత్సరాల క్రితం… 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోని బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆ కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టగా… విచారణ ఇంకా కొనసాగుతోంది. ఓ పక్క దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: