Ys Jagan: పవన్​ కార్పొరేటర్ కు ఎక్కువ... ఎమ్మెల్యేకు తక్కువ ‌!
ys-jagan-vs-pawan
ఆంధ్రప్రదేశ్

Ys Jagan: పవన్​ కళ్యాణ్​ కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ ‌!

Ys Jagan: ఏపీ(AP) డిప్యూటీ సీఎం(Deputy CM)  పవన్​ కళ్యాణ్(Pawan Kalyan) ​పై వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan)​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్​ కళ్యాణ్​ కార్పొరేటర్(corporator)​కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు”అని ఎద్దేవా చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా (Opposition status) రాదని, ఆ పార్టీకి వచ్చిన సీట్లకు జర్మనీ(Germany)లోనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న పవన్​ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఆయన ఈ మేరకు కౌంటర్(Counter)​ ఇచ్చారు. బుధవారం తాడేపల్లిలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన జగన్… ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్(State Budget), గవర్నర్ ప్రసంగం(Governor Speech) తదితర అంశాలపై కూటమి(Alliance) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా… ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా బడ్జెట్ ప్రసంగం సాగిందని ఎద్దేవా చేశారు. బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ అన్న విషయం మరోసారి స్పష్టమైందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందని, రెండిట్లోనూ ప్రజలను చంద్రబాబు(CM Chandrababu Naidu) మోసం చేశారని విమర్శించారు. కొన్ని హామీలకు అరకొరగా కేటాయింపులు చేశారని, మరికొన్నింటికి అసలు ఏమి కేటాయించలేదని మండిపడ్డారు. పైగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ పాలనలో తాము దాదాపు 6.30 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించామని జగన్ గుర్తుచేశారు.

ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా?

ఇక, అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని వ్యాఖ్యానించిన మాజీ సీఎం ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీకి మూడు సీట్లు ఉన్నా… ఆప్ ప్రతిపక్ష హోదా ఇచ్చిందని గుర్తుచేశారు. వైసీపీ వాళ్లకు ఏ పనులూ చెయ్యెద్దు అన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ… పథకాలు ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి ఇదేమైనా బాబు గారి సొమ్మా? అని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోందని, పక్షపాతాలకు, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని చంద్రబాబు ప్రమాణం చేశారు. ఇప్పుడేమో బహిరంగంగా పథకాలు ఇవ్వొద్దంటున్నారని, ఇలాంటి వ్యక్తిని సీఎంగా కొనసాగించడం ఎంతవరకు సమంజసమని విమర్శించారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..