Posani Krishnamurali: వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ(Ap) హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ (Quash petition) దాఖలు చేశారు. దీంతో పాటు ఇప్పటి వరకూ పాతపట్నం, సూర్యారావుపేట, కర్నూలు, అదోని టూటౌన్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. పోలీసులు అన్యాయంగా తనపై తప్పుడు కేసులు బనాయించారని పిటిషన్‌లో పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు పోసానికి వర్తించవని ఆయన తరుఫు న్యాయవాది చెబుతున్నారు. మొత్తం నాలుగు కేసుల్లో ఏడేళ్ల పాటు శిక్షపడేలా సెక్షన్లను ఉన్నాయని, ఈ నేపథ్యంలో ముందు నోటీసు ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోసునేలా ఆదేశాలు ఇవ్వాలని పోసాని తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. కాగా, ఏపీలో ఇప్పటివరకు పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఆదోనీలో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై పోలీసులు తరలించారు. మరోవైపు పోసానిని విచారణకు అనుమతివ్వాలని విజయవాడ, గుంటూరు పోలీసులు పీటీ వారెంట్(PT Warrant) దాఖలు చేశారు.
Also Read:
Ys Jagan: పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ !
AP Politics: ‘హోదా హోరి’…. ప్రతిపక్ష హోదాపై కూటమి వర్సెస్ వైసీపీ