DMK Councilor: కేంద్రం సూచించిన త్రిభాషా విధానాన్ని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. హిందీకి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చేపట్టిన హిందీ వ్యతిరేక కార్యక్రమంలో ఓ డీఎంకే నేత.. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మహిళ చేతిని పట్టుకొని
కేంద్రం ప్రకటించిన త్రిభాషా విధానంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో డీఎంకే పార్టీ నేతలు సైతం ఆయన బాటలోనే నడుస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కూనురు మున్సిపాలిటీ పరిధిలో డీఎంకే పార్టీ.. హిందీ వ్యతిరేక ఆందోళనలు చేపట్టింది. ఇందులో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్.. ఓ మహిళతో దారుణంగా ప్రవర్తించారు. డీఎంకే సభ్యులు అందరూ సీరియస్ గా ప్రతిజ్ఞ చేస్తున్న క్రమంలో మహిళ చేతికున్న గాజును అతడు లాగుతూ కనిపించాడు.
இந்தி எதிர்ப்புப் போர்வையில், வளையலைத் திருடும் குன்னூர் நகர்மன்ற 25-வது வார்டு திமுக கவுன்சிலர் திரு ஜாகிர் உசேன்.
திருட்டையும் திமுகவையும் எப்போதும் பிரிக்கவே முடியாது! pic.twitter.com/1wQKadFcnY
— K.Annamalai (@annamalai_k) March 4, 2025
నెటిజన్ల మండిపాటు
కౌన్సిలర్ జాకీర్ మహిళ చేయి పట్టుకోగా పొరపాటున జరిగినట్లు భావించి ఆమె నవ్వింది. చేయి వదలకపోవడంతో వెంటనే విదిలించుకుంది. అయినా కూడా కౌన్సిలర్ ఆమె చేయి వదలకుండా గాజును లాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సదరు మహిళ చేతిని పైకి కిందకి అంటూ అతడికి అందకుండా చేసింది. ఇది గమనించిన మరో మహిళ.. కౌన్సిలర్ చేయిని వెంటనే కిందకి తోసేసింది. ఇదంతా కెమెరాల్లో రికార్డు కావడంతో నెట్టింట వైరల్ మారింది. డీఎంకే నేత ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: M K Stalin: ‘మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి’.. కేంద్రానికి సీఎం సవాల్