m k stalin
జాతీయం

M K Stalin: ‘మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి’.. కేంద్రానికి సీఎం సవాల్

M K Stalin: దేశంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందంటూ పలు దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. అందులో ముఖ్యంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ విషయమై కేంద్రాన్ని క్రమం తప్పకుండా విమర్శిస్తూనే ఉన్నారు. తన సూటి ప్రశ్నలతో కేంద్రాన్ని నిలువునా కడిగిపారేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోమారు స్పందించిన స్టాలిన్.. ఆ రాష్ట్ర బీజేపీ నేతలతోపాటు కేంద్రానికి సవాలు విసిరారు.

‘తమిళ భాషపై ప్రేమను నిరూపించుకోండి’

కేంద్రం సూచించిన త్రిభాషా విధానాన్ని టార్గెట్ చేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. తమిళ భాషపై ప్రధాని మోదీకి ప్రేమ ఉందని ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ సవాలు విసిరారు. రాష్ట్రంలోని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించి తమిళ భాషపై వారికి ఉన్న ప్రేమను నిరూపించుకోవాని సూచించారు. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా గుర్తించి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైళ్లకు అంత్యోదయ, తేజస్, వందేభారత్ వంటి పేర్లకు బదులు తమిళ పేర్లను పెట్టాలని పట్టుబట్టారు. తమిళ భాషపై ప్రేమను మాటల్లో చూపించడం కంటే కూడా.. ఇలా తాను చెప్పినట్లుగా చేసి చేతల్లో చూపిస్తే చాలా బాగుంటుందని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.

‘హిందీ.. 25 భాషలను మింగేసింది’

ఇటీవలే హిందీ భాష గురించి మాట్లాడుతూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష 25 ప్రాంతీయ భాషలను మింగేసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 100 ఏళ్లలో నార్త్ ఇండియాలో 25 భాషలు కనుమరుగయ్యాయని స్టాలిన్ అన్నారు. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉత్తరాధిలో మూడో భాష ఏదంటూ ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.

Also Read: Steven Smith: భారత్ తో ఓటమి ఎఫెక్ట్.. ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం

త్రిభాషా విధానం అంటే ఏంటి

నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ(NEP)లో భాగమైన త్రిభాషా విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషుతో పాటు ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోమని తమిళనాడు సహా పలు దక్షిణాది రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయంపై ఇటీవల ప్రముఖ నటులు కమల్ హాసన్, దళపతి విజయ్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

 

 

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!