IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో ఆసీస్ మంచి స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లనుంది.
ఆసీస్ బ్యాటింగ్ ఇలా..
టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే భారత పేసర్ షమీ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ కూపర్ ను డకౌట్ గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. ఫోర్లు, సిక్సుల సాయంతో విరుచుకుపడ్డాడు. ప్రమాదకరంగా మారుతున్న ట్రావిస్ ను 39 (33) పరుగుల వద్ద భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. మరోవైపు ఆసీస్ బ్యాటింగ్ కు కెప్టెన్ స్మిత్ వెన్నెముకగా నిలబడ్డాడు. 73 (96) పరుగులతో రాణించాడు. ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (61), లుబుషేన్ (29) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. హార్దిక్, కుల్దీప్ లకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే 265 పరుగులు అవసరం.
Also Read: Dhananjay Munde: సర్పంచ్ దారుణ హత్యలో ఆరోపణలు.. మంత్రి రాజీనామా