Abandoned Car: కుంభమేళా మహాయజ్ఞం ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు 66 కోట్ల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఇసుకేస్తే రాలనంత జనం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం లక్షలాది మంది భక్తులు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. ఇదిలాఉంటే ఫిబ్రవరి 26న కుంభమేళా ముగియగా ఇప్పటికీ ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళా ఘాట్ పార్కింగ్ ఏరియాలో తెలంగాణకు చెందిన ఓ కారు అలాగే ఉండిపోయింది. యజమానులు ఎవరూ దాన్ని తీసుకెళ్లకపోవడంతో దుమ్ము దూళి మధ్య అనుమానస్పదంగా దర్శనమిస్తోంది.
మహీంద్రా XUV 700 మోడల్ కారు
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలో తెలంగాణ వాహనం అనుమానస్పదంగా మారింది. మహీంద్రా ఎక్స్ యూవీ 700 మోడల్ కు చెందిన “TS 15 FJ 2528” నెంబర్ కలిగిన కారు గత తొమ్మిది రోజులుగా పార్కింగ్ ఏరియాలోనే ఉండిపోయింది. దీంతో రంగంలోకి దిగిన ప్రయాగ్ రాజ్ పోలీసులు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా తెలంగాణ పోలీసులను సంప్రదించారు. దీంతో అది సంగారెడ్డి ఆర్టీఏ ఆఫీసులో రిజిస్టర్ చేయబడినట్లు తెలిసింది. కారు యజమాని పేరు సాకేత్ ప్రకాష్ వాఘ్ గా గుర్తించారు.
TS registered car left alone at PRAYAGRAJ – Mahakumbh parking area since 9 days.
👉 Share and help the owner remember to pick their vehicle back home
Owner's name – Saket Prakash Wagh from Hyderabad, as per TS e-challan app pic.twitter.com/lZVj2nWlPp
— Jagan Patimeedi (@JAGANBRS) March 3, 2025
కారుపై హైదరాబాద్ లో చలానా
కుంభమేళాలో అనుమానస్పదంగా పడి ఉన్న కారుపై చివరిగా హైదరాబాద్ లో చలానా నమోదైనట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి ఏరియాలో ఓవర్ స్పీడ్ కారణంగా కారుపై పెనాల్టీ విధించారు. దీంతో కారు యజమాని హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ కారు ప్రయాగ్ రాజ్ లోని లోకల్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. కారును కావాలనే వదిలేశారా? లేదా పార్క్ చేసి పొరపాటున మర్చిపోయారా? అన్నది అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది. మరోవైపు కారుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. యజమాని దృష్టికి వీడియో వెళ్లేవరకు ప్రతీ ఒక్కరూ షేర్ చేయాలని కోరుతున్నారు.
Also Read: Madhabi Puri Buch: సెబీ మాజీ చీఫ్ కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు