అంతర్జాతీయం

Arindam Bagchi: అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశం.. ధీటుగా బదులిచ్చిన భారత్

Arindam Bagchi: అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా మారింది. దయాది దేశం పాకిస్తాన్.. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారత్ ను ఇరుకున పెట్టాలని భావించి పలుమార్లు ముట్టికాయలు వేయించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరోమారు అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ ప్రస్తావన వచ్చింది. దాంతోపాటు మణిపుర్ లో నెలకొన్న సంక్షోభం సైతం చర్చను లేవనెత్తారు. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్.. వాటి ప్రస్తావన తీసుకురాగా ఇందుకు భారత్ ధీటుగా బదులిచ్చింది.

అసలేం జరిగిదంటే

తాజాగా జెనీవాలో 58వ మానవ హక్కుల మండలి సమావేశం జరిగింది. ‘గ్లోబల్ అప్ డేట్’ పేరుతో జరిగిన ఈ సమావేశంలో ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ (Volker Turk) పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్, మణిపుర్ అంశాలను ఆయన లేవనెత్తారు. మణిపుర్ లో చెలరేగిన హింస, శాంతి స్థాపన కోసం యుద్ధ ప్రాతిపదికన చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కశ్మీర్ సహా భారత్ లోని పలు ప్రాంతాల్లో మానవ హక్కుల పరిరక్షకులు, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అలాగే పౌరులు తిరిగే ప్రాంతాల్లోనూ ఆంక్షలు పెట్టడంపై వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారత్ లో ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని టర్క్ వ్యాఖ్యానించారు.

Also Read: North Korea:’మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’.. ట్రంప్ కు ఉ.కొరియా స్ట్రాంగ్ వార్నింగ్

ఖండించిన భారత్

ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ వ్యాఖ్యలను భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్జీ (Arindam Bagchi) ఖండించారు. గ్లోబల్ అప్ డేట్ లో టర్క్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు టర్క్ చేసిన వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం సమంజసం కాదని అరిందమ్ బాగ్చీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజా నిజాలు తెలుసుకోకుండా.. భారత్ అంటే గిట్టని వారు చేసిన ఆరోపణలను టర్క్ నేరుగా ప్రస్తావించారని మండిపడ్డారు.

మణిపుర్ లో ఆంక్షలు ఎత్తివేత

సంక్షోభంలో ఉన్న మణిపుర్ లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మార్చి 8 నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అధికారులకు స్పష్టం చేశారు. జనం స్వేచ్ఛగా రోడ్డుపై తిరిగే వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. జనసంచారానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షా సూచించారు.

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు