| Zelenskyy: ట్రంప్ విషయంలో జెలెన్ స్కీ యూటర్న్
Zelensky
అంతర్జాతీయం

Zelensky: ట్రంప్ విషయంలో జెలెన్ స్కీ యూటర్న్.. ఇంతలో ఎంత మార్పు

Zelensky: ఇటీవల శ్వేతసౌధం వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ తీవ్ర వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ట్రంప్ తో మాటల యుద్ధం అనంతరం అమెరికా పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని జెలెన్ స్కీ ఆ దేశం నుంచి యూకే పయనం అయ్యారు. దీంతో అమెరికా – ఉక్రెయిన్ బంధానికి బీటలు వాలినట్లేనని ప్రపంచ దేశాలు నిర్ధారించుకున్నాయి. ఒకప్పటిలా ఆ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. అమెరికాతో డీల్ కుదుర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు తమ ప్రజలు అమెరికాకు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని అగ్రరాజ్యాన్ని ఆకాశానికెత్తారు.

ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటి: జెలెన్ స్కీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాదోపవాదాలు అనంతరం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వెంటనే ఐరోపా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ముగింపుపై అక్కడ జరిగిన ఐరోపా దేశాధినేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ట్రంప్ తో భేటి సహా పలు అంశాలపై జెలెన్ స్కీ మాట్లాడారు. అమెరికాతో సత్సంబంధాలను తాను కోరుకుంటున్నట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. అర్ధవంతమైన చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు ఆహ్వానిస్తే అతడితో భేటి అవుతానని స్పష్టం చేశారు. అటు ఖనిజాల ఒప్పందం పై ట్రంప్ తో ఏకాభిప్రాయం కుదిరితే ఆ డీల్ పై సంతంకం చేసేందుకు తాను సిద్ధమేనని జెలెన్ స్కీ పునరుద్ఘటించారు.

‘అమెరికాకు రుణపడి ఉంటాం’

ఐరోపా దేశాధినేతలతో జరిగిన భేటి పైనా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఐరోపా నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని ఈ భేటి ద్వారా మారోమారు స్పష్టమైందని చెప్పారు. అలాగే అగ్రరాజ్యం గురించి మరోమారు ప్రస్తావించిన జెలెన్ స్కీ.. ఆ దేశం నుంచి అందుతున్న సాయానికి తామెప్పుడు రుణపడి ఉంటామని అన్నారు. తమ స్వాతంత్రాన్ని రక్షిస్తున్న అమెరికాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రష్యాతో యుద్ధం ముగింపునకు అమెరికా చేస్తోన్న ప్రయత్నాలను తాను అర్థం చేసుకోగలనని జెలెన్ స్కీ పేర్కొన్నారు. తాము కూడా శాంతినే కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్ రక్షణకు అవసరమైన భద్రతా హామీలను తాము ఆశీస్తున్నట్లు జెలెన్ స్కీ చెప్పారు.

ట్రంప్ తో భేటిలో ఏం జరిగిందంటే?

గతవారం శ్వేతసౌధం వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ భేటి అయిన సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధానికి స్వస్థి పలకడంతో పాటు ఉక్రెయిన్ లోని ఖనిజాలను తవ్వుకునేందుకు యూఎస్ కు అనుమతివ్వాలన్న అంశాలపై ఈ సమావేశం జరిగింది. యుద్ధాన్ని ఆపడానికి తాను సిద్ధమేనని, మరి భవిష్యత్తులో రష్యా తిరిగి దాడి చేయదన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నను జెలెన్ స్కీ ఈ భేటిలో లేవనెత్తారు. అదే జరిగితే అమెరికా తమకు రక్షణ కల్పించాలని పట్టుబట్టారు. దీంతో ట్రంప్ తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్ సైతం జెలెన్ స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం సాయం చేస్తున్న వచ్చిన దేశాన్ని అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు.

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య