Konda Surekha: మేడారం జాతరలో కీలకఘట్టాలకు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు రాలేదు. మంత్రుల మధ్య సఖ్యత లేదా? లేకుంటే మరేదైనా కారణమా? అనేది ఇప్పుడు విస్తృత చర్చజరుగుతుంది. జిల్లా ఇన్ చార్జీ మంత్రి, మరోమంత్రి యాక్టీవ్ గా ఉండి జాతరను మానిటరింగ్ చేస్తున్నారు. కానీ దేవాయశాఖ మంత్రి లేకపోవడం వెలితిగా మారింది.
ఆమె పాల్గొనకపోవడం హాట్ టాపిక్
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర, మహాకుంభమేళాగా జరిగే మేడారం జాతరకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. సొంత జిల్లాలో జాతర జరుగుతుండటం, మళ్లీ దేవాదాయశాఖ మంత్రిగా కొనసాగుతుండటం ఆమె పాల్గొనకపోవడం హాట్ టాపిక్ అయింది. జాతర తొలిరోజూ మేడారం నుంచి సారలమ్మ, పూనుగండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకోగా వనదేవతలకు అధికారికంగా మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకాలేదు. అంతేకాదు రెండోరోజూ సైతం సమక్క వనం నుంచి మేడారం గద్దెకు చేరుకోగా ఆ కార్యక్రమంలో సైతం సురేఖ పాల్గొనలేదు. అంతేకాదు జాతరలో దేవాదాయశాఖ మంత్రి కీలక భూమిక పోషిస్తారు. కానీ సురేఖ మాత్రం పాల్గొనకపోవడం, జిల్లాలో అంతర్గత రాజకీయాలే కారణమనే ప్రచారం జరుగుతుంది.
Also Read: Konda Surekha: మంత్రి కొండా సురేఖతో టీటీడీ చైర్మన్ భేటి.. రోప్ వే నిర్మాణ పనులకునిధులు కేటాయించాలి!
హైకమాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు
మేడారం జాతర ముందు అభివృద్ధి పనులకు నిర్వహించిన టెండర్ల విషయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని కొద్దిరోజుల కిందటే హైకమాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మేడారం అభివృద్ధి పనులను పొంగులేటికి చెందిన కంపెనీకి రాష్ట్ర సర్కార్ అప్పగించడంతో అసంతృప్తితో ఉంది.దీంతో గతంలో మేడారంపై జరిగిన సమీక్ష సమావేశంలో, మీడియా ప్రెస్ మీట్లలోనూ సురేఖ దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు జాతరకు దూరంగా ఉండటం విభేదాలే కారణమా? అనేది చర్చమొదలైంది.
Also Read: Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ అత్యంత ప్రమాదకరం.. భద్రతపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన!

