Medigadda Barrage: తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీను కేంద్రం ప్రమాదకర డ్యాంగా గుర్తించింది. పార్లమెంట్ లో మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) భద్రతపై కేంద్రజలశక్తి సహాయమంత్రి రాజ్ భూషణ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో డ్యాంల భద్రతపై టీడీపీ ఎంపీలు లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరిలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గతేడాది వర్షకాలం అనంతరం నిర్వహించిన తనిఖీల్లో మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని కేంద్రమంత్రి తెలిపారు. బ్యారేజ్ కు సంబంధించిన లోపాలను గుర్తించామని వెల్లడించారు. దేశంలోని పాత డ్యాంల స్థితి గతులు, భద్రతపైనా వివరించారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ స్పెసిఫైడ్ డ్యామ్స్ (ఎన్ఆర్ఎస్డీ) 2025 ప్రకారం దేశంలోని 50 ఏళ్ల కు పైబడిన డ్యాంలు మొత్తం 1,681 ఉన్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం డ్యామ్‌లకు వర్షాకాలనికి ముందు, తర్వాత తనిఖీలు నిర్వహించడం తప్పనిసరిఅన్నారు. వర్షాకాలనికి ముందు 2025లో సుమారు 6,524 డ్యామ్ లు, రుతుపవనాలకు తర్వాత 6553డ్యామ్‌లకు తనిఖీలు పూర్తయ్యాయన్నారు.
అత్యంత ప్రమాదకరం
2025 నాటి పోస్ట్-మాన్‌సూన్ తనిఖీ నివేదికల ఆధారంగా దేశంలోని మూడు డ్యాంలను కేటగిరి-1 కింద గుర్తించినట్లుతెలిపారు. ఈ కేటగిరి కింద అత్యంత ప్రమాదకరంగా ఉన్న డ్యాంలను కేంద్రం గుర్తించిందని, ఈ డ్యాంముల్లో అత్యంత తీవ్రమైన లోపాలు, తక్షణ జోక్యం అవసరం అని పేర్కొంది. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీతో పాటు ,ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజురీ డ్యామ్,జార్ఖండ్‌లోని బొకారో బ్యారేజీ ని గుర్తించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి నిర్మాణపరమైన లోపాలనుజాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) గుర్తించిందన్నారు. ఆధారిటీ సూచనల మేరకు బ్యారేజీ మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తొలగించి పునర్నిర్మించాలి
ఎన్డీఎస్ఏనివేదికలో బ్లాక్-7కు కోలుకోలేని నష్టం జరిగిందని, దానిని తొలగించి పునర్నిర్మించాలని సిఫార్సు చేసిందని మంత్రి తెలిపారు. కేటగిరి-2 కింద 216 ఆనకట్టలు గుర్తించడం జరిగిందని, వీటిలో69 డ్యామ్‌లు యాభై సంవత్సరాలకు పైబడినవి ఉన్నాయన్నారు. డ్యామ్ పునరావాసం,మెరుగుదల ప్రాజెక్ట్ (డ్రిప్) కింద పదేళ్లపథకం (2021-2031) ప్రపంచ బ్యాంక్ , ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సహకారంతో మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు.ఈ పథకం కింద 19 రాష్ట్రాలు ,3 కేంద్ర సంస్థలలోని మొత్తం 736 ఆనకట్టల పునరావాసం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. మొత్తం ఆర్థిక వ్యయం ₹10,211 కోట్లు అన్నారు. 2025 డిసెంబర్ 31 నాటికి, డ్రిప్-2 కింద మొత్తం ₹2,029 కోట్లు ఖర్చు చేశారు, 35 ఆనకట్టల వద్ద ప్రధాన పునరావాస పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
Also Read: Telangana govt: టీచర్ల సర్దుబాటుకు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

