Warangal Drunk Drive Rule (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal Drunk Drive Rule: రోడ్డు ప్రమాదాలకు అదే ముఖ్య కారణం.. సన్‌ ప్రీత్‌ సింగ్‌

Warangal Drunk Drive Rule: ఇక వరంగల్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడపితే జైలు తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Commissioner Sunpreet Singh) అన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన 31మంది వాహనదారులు వారం రోజుల్లో జైలు శిక్ష అనుభవించారని సిపి తెలిపారు. ఈ విషయమై సీపీ మాట్లాడుతూ వానదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగాని, పరోక్షంగాని రోడ్డు ప్రమాదాలకు ప్రధానకారకులు కావడంతో కొన్ని సందర్భాల్లో సదరు మద్యం సేవించిన వాహనదారుడు సైతం రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది దృష్టిలో వుంచుకోని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మద్యం సేవించి వాహనదారుల వలన కలిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.

31 మందికి వాహనదారులకు జైలు శిక్ష
వరంగల్‌ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్‌ మరియు లా అండ్‌ ఆర్ధర్‌(Law And Order) పోలీసులు నిరంతరం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌(Drunk And Drive) తనీఖీలు చేపట్టడం జరుగుతుందని. అలాగే గ్రామీణా ప్రాంతాల్లోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీలు నిర్వహించబడుతున్నాయి. ప్రధానం వరంగల్‌(Warangal) ట్రై పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ముందుగా కమిషనరేట్‌ కార్యాలయములోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ వాహనదారుల కుటుంబ సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట పర్చడం ద్వారా వాహనదారులకు కోర్టులో జైలు శిక్ష లేదా జరిమానా విధించడం జరుగుతుందని. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో గత నెల 28 నుంచి శుక్రవారం వరకు వారం ట్రైసిటి ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా జరిపిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీల్లో మొత్తం 376 కేసులు నమోదు కాగా, ఇందులో 31 మందికి వాహనదారులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, 3లక్షల 83వేల రూపాయలు వాహనదారులపై ఫైన్‌ రూపంలో కోర్టులో జరిమానాలు చెల్లించారని పోలీస్‌ కమిషనర్‌ వెల్లడిరచారు.

Also Read: MP Crime: ఇదేం దిక్కుమాలిన కేసు.. ప్రియుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. చివరికి!

మొత్తం 104 కేసులు నమోదు
నమోదైన కేసుల్లో అత్యధికంగా హన్మకొండ(Hanmakonda) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 138 కేసులు నమోదు కాగా ఇందులో 10 మందికి జైలు శిక్ష పడగా, 96వేల ఎనిమిది వందల రూపాయల్లో వాహనదారులు కోర్టులో జరిమానా చెల్లించారు. ఇదే రీతిలో వరంగల్ పరిధిలో 134కేసులో 15మంది కి జైలు శిక్ష, 1లక్ష 77వేల ఒక వంద రూపాయల జరిమానా, కాజీపేట పరిధిలో మొత్తం 104 కేసులు నమోదు కాగా ఇందులో అరుగురికి జైలు శిక్ష పడగా, మిగితా కేసుల్లో మొత్తం ఒక లక్ష 9వేల వందల రూపాయలు జరిమానా చెల్లించారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ వాహన దారులకు సూచన చేస్తూ మీ కుటుంబాన్ని దృష్టిలో వుంచుకోని వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపవద్దని, మీరు చేసే తప్పిదాలతో ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయినవారు కొందరైతే మరి కొందరు ఆంగవైకల్యంగా జీవితాలను కొనసాగిస్తూన్నారని. ఇకనైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని. వాహనదారులు మీ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల ప్రధాన లక్ష్యమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు