MLA Nagaraju (imagedcredit:swetcha)
నార్త్ తెలంగాణ

MLA Nagaraju: పేద ప్రజల కంటే బడా బాబులే ముఖ్యమా?.. ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట స్వేచ్ఛ: MLA Nagaraju: రాజ్యంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోక్ సభ సభ్యులు రాహూల్ గాంధీ, జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో వర్ధన్నపేట కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి డా”బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పరిరక్షణ యాత్ర ను ప్రారంభించారు.

పట్టణంలో సుమారు 2 కిలోమీటర్ల పాదయాత్రగా డి.జె చప్పుళ్ళు, రాకెట్ బాంబుల మోతల మధ్య ఊరేగింపు నిర్వహించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో జాతీయ రహదారి 563 అంబేద్కర్ విగ్రహం నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు అక్కడి నుండి ఫిరంగడ్డ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

Also Read: AP Govt: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఎంచక్కా జేబులో పట్టే కార్డు.. మీ కోసమే..

నేడు దేశంలోని పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, దేశ ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులే ముఖ్యం అవుతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అని తెలిపారు. ఇటీవల కాలంలో పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందని అందుకు ఉదాహరణ కేంద్ర మంత్రి అమిత్ షా అంబెడ్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.

ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులనుండి రాజ్యాంగాన్ని కాపాడాలని సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రం లో ప్రతి గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలోని అన్ని వర్గాలు ప్రజలకు తెలియజెయాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భుజాలపై ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర రావు మరియు జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – వరదరాజేశ్వర్ రావు, తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ స్టేట్ కో- ఆర్డినేటర్ పులి అనిల్,నిమ్మని శేఖర్ రావు,కాంగ్రెస్ జిల్లా,మండల శ్రేణులు,యూత్ నాయకులు పాల్గొన్నారు.

Also Read: Telangana Cabinet: మంత్రివర్గ విస్తరణ.. మళ్లీ మొదటికొచ్చిందా? అసలేం జరుగుతోంది?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు