నర్సంపేట స్వేచ్ఛ: Chapata chillies: వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో పండుతున్న చాపాట మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు జియాలాజికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ లభించింది. ప్రపంచ స్థాయిలో వరంగల్, నర్సంపేట మిర్చికి లభించిన గొప్ప గుర్తింపు ఇది.తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన విషయంలో ఇది18 గా మనం చూడవచ్చు.
దూర దృష్టితో రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి రైతులను ఐక్యం చేయాడానికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్ పి ఓ లు నేడు సత్ఫలితాలను అందించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కూడా మన ప్రాంతానికి లభించడం గర్వకారణం. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట ఎఫ్ పి ఓ పేరు మీద చపాట మిర్చికి జిఐ సర్టిఫికేట్ లభించింది.
భవిష్యత్తులో చపాట మిర్చికి మంచి ధర పలకడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసుకునే సౌకర్యం కూడా దీనివల్ల లభిస్తుంది.ఈ విషయాన్ని జిఐ సంస్థ తిమ్మంపేట ఎఫ్ పి ఓ పేరుమీద సర్టిఫికెట్ ఇష్యూ చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆర్టికల్చర్ యూనివర్సిటీకి అందచేసింది.
Also Read: Fighter Jet Crash: కూలిన జాగ్వార్ ఫైటర్ జెట్.. ఒక పైలట్ మిస్సింగ్.. మరొకరు సురక్షితం