Warangal Collector: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(*Satya Sarada) అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 375వ జయంతి ఉత్సవాల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జీ సంధ్యా రాణి(Sandya Rani) కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Also Read: Actor Suhas: ‘హే భగవాన్!’.. ఈసారి కచ్చితంగా హిట్ కొడతా..
ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకుడు
కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిలిచిపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోశాల పద్మ, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, గౌడ సంఘ నాయకులు గట్టు రమేశ్ గౌడ్, సుధాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
