Collector Rahul Sharma: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో పవిత్రమైందని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకోవాలని భూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ (Collector Rahul Sharma) సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన 16వ జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలరని పేర్కొన్నారు. యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకొని ప్రతి ఎన్నికలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
Also Read: Collector Rahul Sharma: మినీ మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ రాహుల్ శర్మ!
ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు
ఈ సందర్భంగా కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు, సీనియర్ సిటీజన్ ఓటరులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన బిఎల్ఓ, సూపర్ వైజర్లు చేంజ్, ఆపరేటర్లుకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఓటరు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. అనంతరం ఓటు హక్కు నమోదు, వినియోగంపై ప్రతిజ్ఞ చేపించారు. తదుపరి విద్యార్థులచే ఓటు హక్కు అవగహనపై సైకిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, జిల్లా అధికారులు, ఎన్నికల విభాగ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

