GST: జీఎస్టీ స్లాబులో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో ద్విచక్ర వాహనాలు కార్ల కొనుగోలు మందగించాయి. ఈనెల 22 నుంచి జిఎస్టి కొత్త స్లాబ్ లో అమలు కానున్న తరుణంలో వాహనాలను కోణాలను వినియోగదారులు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు దీనికి ప్రధాన కారణం 20% ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో ఈ మేరకు ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని షోరూంలలో కొనుగోలుదారులు వాహనాల కోసం ముందస్తు బుకింగ్ లు చేసుకోకపోవడం, కొనుగోల కోసం షో రూమ్లకు కస్టమర్లు రాకపోవడంతో వ్యాపారాలు స్తంభించి వాహనాల కొనుగోలు తగ్గడంతో వాహనాల షోరూంలు వెలవెలబోతున్నాయి.
సామాన్య మధ్య తరగతి వర్గాలకు ఊరట
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) స్వరూపంలో మార్పుల నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించనుంది.ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు కొంతమేర తగ్గనున్నాయి. ద్విచక్ర వాహనాలపై సీసీ కనుగుణంగా రూ 8 వేల నుంచి రూ 20 వేల వరకు తగ్గే అవకాశం ఉంది. 350 సీసీ ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ ని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. అదేవిధంగా కార్ల ధరలలో సైతం రూ 60 వేల నుంచి 1.50 లక్షల వరకు ధర తగ్గే అవకాశం ఉంది. 1200 సి.సి లోపు పెట్రోల్, ఎల్ పి జి, సిఎన్జి కార్లు 1500 చూసి లోపు డీజిల్ డీజిల్ హైబ్రిడ్ కార్లు ద్విచక్ర వాహనాల పైన సైతం అదే రీతిన జిఎస్టి తగ్గించారు.
వాహనాలపై జీఎస్టీ తగ్గింపుతో స్తంభించిన వ్యాపారం
సాధారణంగా దసరా వేళ వాహనాల కొనుగోలు చేయడం ఆనవాయితీ.. ఈ సెంటిమెంటు ఉన్నవారు కార్లు, ద్విచక్ర వాహనాలకు ముందస్తుగా బుకింగ్ చేసుకుని దసరా రోజు మంచి రోజుగా భావించి ఆ రోజున బైకును,కారును డెలివరీ తీసుకోవడానికి కస్టమర్లు ఇష్టపడుతుంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గింపుతో దసరా నాటికి అమలులోకి రానున్నడంతో ఆయా వాహనాల ధరలు తగ్గనున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని వినియోగదారులు చూస్తున్నారు. ధరలు తగ్గనున్న నేపథ్యంలో దసరా పర్వదినాన కొనుగోలు సైతం పెరగనున్నట్లు షోరూం నిర్వాహకులు భావిస్తున్నారు. జిఎస్టిపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు కొంత మేర స్తంభించినా దసరా నాటికి ఊపందుకకోనున్నాయని, అందుకు అనుగుణంగా వాహనాలను సైతం సమయానికి కస్టమర్లకు కావాల్సిన వాహన రకాలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Shanmukh Jaswanth: యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ ‘ప్రేమకు నమస్కారం’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్