Telangana Police ( image credit: swetcha reporter)
తెలంగాణ, నార్త్ తెలంగాణ

Telangana Police: గంజాయి రవాణాలో.. అక్రమార్కులు కట్టుదిట్టంగా వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారా?

Telangana Police: గంజాయి విచ్చలవిడిగా వ్యాపారం సాగుతుందంటే అందుకు అధికారుల నిర్లక్ష్యం కారణమా? లేదంటే అక్రమ వ్యాపారుల చాకచక్యమా? అనేది అంత చిక్కడం లేదు. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ అక్రమ వ్యాపారుల ఆగడాలు సైతం పెరిగిపోతున్నాయి. నిఘాతో పోలీసులు వ్యవహరించిన అంతకంటే పటిష్టమైన నిఘాతో అక్రమార్కులు కట్టుదిట్టంగా వ్యాపారం చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారా? సాధారణంగా పోలీసుల (Telangana Police) వద్ద అక్రమార్కులు చేసే అక్రమ వ్యాపారాల డాటా మొత్తం ఉంటుంది. వారికి సంబంధించిన సెల్ ఫోన్లపై నిఘా పెడుతూ వారిని కటకటాల్లోకి పంపిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఐరిష్ లతో అక్రమ వ్యాపారుల డేటాను ఎంట్రీ చేసే పోలీసు వ్యవస్థ వారు చేసే అక్రమ గంజాయి వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారా? లేదంటే నిఘా లో వైఫల్యం చెందుతున్నారా? అనేది అంతుచిక్కడం లేదు.

Also  Read: Nalgonda Crime: నల్గొండలో దారుణ ఘటన.. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య!

నిత్యం గంజాయి మత్తులో యాక్సిడెంట్లు, హత్యలు

రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒకచోట గంజాయి ని పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. గంజాయి నిత్యం అత్యవసర వస్తువుగా తెలంగాణ లో మారిపోయిందా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. 2020 మార్చి 22 నుంచి తొలివిడత కరోనా లాక్ డౌన్ సమయంలో హయ్యర్ సిటీస్ లో ఉన్నత విద్య అభ్యసించే యువత అంతా పట్టణ, పల్లె గ్రామాల్లోకి చేరిపోయారు. ఇదే సమయంలో గంజాయి కల్చర్ గల్లీ నుంచి పట్టణ పురవీధుల వరకు విస్తరించి పోయింది. లాక్ డౌన్ సమయంలో నిషేధిత ప్రాంతాల్లో సంచరించిన యువత గ్రామాల్లోని చిరుప్రాయంలో ఉన్న వారికి సైతం గంజాయి టేస్ట్ చూపించారు.

నాటి నుంచి నేటి వరకు పల్లె గ్రామాలనుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు గంజాయి వ్యాపారం, అమ్మకాలు, కొనుగోలు, సేవించడం నిత్య కృత్యంగా మారిపోయింది. లాక్ డౌన్ నుంచి ప్రజలంతా బతికి బయటపడితే గంజాయి రూపంలో ప్రజలను పట్టిపీడిస్తుంది. గంజాయి మత్తులో ఉన్న యువత ఆ సమయంలో ఏం చేస్తారో కూడా తెలియని దుస్థితి వచ్చేసింది. గత రెండు మూడేళ్ల క్రితం మహబూబాబాద్ పట్టణంలోని ఫ్లై ఓవర్ పై ఇద్దరు యువకులు భారీ ద్విచక్ర వాహనంపై గంజాయి మత్తుతో అతివేగంగా ప్రయాణించి కింద పడిపోయారు. అందులో ఓ గిరిజన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అంతకంటే ముందు యశోద గార్డెన్ సమీపంలో శిఖార్ఖాన గడ్డాకు చెందిన ఓ యువకుడు వృద్ధురాలిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది.

బంధువులపై విచక్షణారహితంగా దాడి చేస్తూ హత్యలు 

అదేవిధంగా మహబూబాబాద్ పట్టణ శివారు అర్బన్ పార్కు ప్రాంతంలో ఓ యువకుడు కారు నడుపుతూ ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆ యువకులు మృత్యువాత చెందారు. గంజాయి సేవించిన ఉన్నత విద్య అభ్యసించే యువత కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై విచక్షణారహితంగా దాడి చేస్తూ హత్యలకు పాల్పడుతున్నారు. గంజాయి మత్తులో ఉన్న యువత చిరుప్రాయంలో ఉన్న చిన్నారుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అఘాయిత్యాలు చేస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు. ఈ గంజాయి మత్తు ఎక్కడికి తీసుకెళ్తుందో? నిత్యం గంజాయి మత్తులో తూగుతున్న యువతను ఎక్కడికి తీసుకెళ్తుందో? ఇంకా మరిన్ని అఘాయిత్యాలు చేసేందుకు దోహదపడుతుందో ఎవరికి అంత చిక్కని ప్రశ్నగానే మిగులుతుంది.

Also Read: Telangana Police: ప్రేమ పేరుతో యువతుల జీవితాలతో ఆటలు.. చివరికి?

విస్తృతంగా పోలీసులు దాడులు

ఓవైపు విస్తృతంగా పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ అక్రమ గంజాయి వ్యాపారులు రెచ్చిపోతూనే ఉన్నారు. గంజాయి ని సిగరెట్లలో నింపి కొంతమంది మత్తును ఆస్వాదిస్తే, మరి కొంతమంది లిక్విడ్ రూపంలో, చాక్లెట్ల రూపంలో సేవిస్తూ మత్తులో తేలిపోతున్నారు. ఏపీ నుంచి తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు ఏపీలో గంజాయి ముడి సరుకు తయారవుతుంది. అక్కడినుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలకు తరచూ గంజాయి అక్రమార్కులు రవాణా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు రైలు మార్గం ప్రధానంగా కనిపించడంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో నిత్యం ఏదో ఓచోట గంజాయి పోలీసులకు దొరుకుతుంది.

ఎక్కడెక్కడ ఎంత? 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ వద్ద పోలీసులు రూ.2.5 కోట్ల విలువైన 499 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా నుంచి అశ్వరావుపేట మీదుగా కారులో తరలిస్తున్న రూ. 1.1 కోట్ల విలువైన 222 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2025 లో ఇప్పటివరకు రూ.25.85 కోట్ల విలువైన 52 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.

462 వాహనాలను సీజ్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి (ప్రత్యేకంగా ప్రయోగశాలలో పెంచిన) రూ. 12 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 880 కేసుల్లో 1625 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 462 వాహనాలను సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా, వ్యాపారం చేసేవారిలో 18 నుంచి 30 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా అరెస్టు అయ్యారు. 31 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో మరికొంతమంది అరెస్టు అయ్యారు. ఇందులో ఎక్కువగా నేరచరిత్ర ఉన్నవారు అక్రమ గంజాయి వ్యాపారాలు చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Also Read: Medak Police: గిరిజన మహిళ హత్యకేసును 5 రోజుల్లోనే ఛేదించిన పోలీసులు.. వెలుగులోకి సంచలన నిజాలు!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?