Jangaon Road Accident: జనగామ జిల్లా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు గాయపడగా, ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. తెల్లవారుజామున రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం వరంగల్ హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఇసుక లారి ఆగివుంది.
Also Read: Vikarabad Road Accident: తెలంగాణలో మరో ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. పరారీలో డ్రైవర్
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు
వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఆర్టీసీ రాజదాని ఎక్స్ ప్రెస్ బస్ ఆగి ఉన్న ఇసుక లారీ నెంబర్ TG7uk5469ని అతివేగంగా, బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎం జి ఎం కు తరలించగా, సీరియస్ గా ఉన్న ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. మృతులు దుండిగల్‌కు చెందిన పూలమాటి ఓం ప్రకాష్, హనుమకొండకు చెందిన నవదీప్ సింగ్‌గా గుర్తించారు. మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా దావఖానకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనతో దావఖానా ప్రాంగణం మారుమోగుతోంది.
Also Read: Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్ లోయలో పడి 8 మంది మృతి
