Farmers Protest: కొరవి మండలం నేరడ రెవెన్యూ గ్రామంలో సర్వేనెంబర్ 545/1 సమిష్టి వ్యవసాయ సహకార సంఘం (CJFS)కు చెందిన అసైన్డ్ భూమి(Assigned land)ని నేరడ గ్రామం శివారు బాల్య తండా కు చెందిన సుమారు 50 మంది గిరిజన రైతులు దళిత రైతుల నుంచి 2009లో కొనుగోలు చేశారు. అప్పటినుంచి సేద్యం చేసుకుంటున్నారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలో సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి అప్పటి ప్రభుత్వం ఐదవ విడత భూమిలో సాగులో ఉన్న రైతులకు అసైన్మెంట్ పట్టాదారు పాస్ బుక్కులు ఇచ్చారు.
సొసైటీ భూమి అని చెప్పి
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనూ టిఆర్ఎస్(TRS) ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన లో భాగంగా 50 మంది రైతులకు పట్టాదారు పాసుబుక్కులను జారీ చేశారు. కొనుగోలు చేసిన సమయం నుంచి ఈ ఏడాది వరకు ఆ భూముల్లో సేద్యం చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలనే గిరిజనులకు భూములను అమ్మిన దళితులు తిరగబడి 2009లో రద్దయిన సొసైటీ పేరు చెప్పి ప్రస్తుతం సాగు చేసుకుంటున్న రైతులను అది సొసైటీ భూమి అని చెప్పి గిరిజన రైతులను దళితులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని మహబూబాబాద్(Mehabubabad) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
Also Read; Spain Airport: మీరేం తల్లిదండ్రులురా అయ్యా.. బిడ్డను అలా వదిలేశారు!
భూమికి హక్కుదారులం మేమే
సిజేఎఫ్ఎస్(CJfs) సొసైటీ సభ్యులకు సంబంధించిన 545/1 సర్వే నెంబర్లు దాదాపు 500 ఎకరాల వ్యవసాయ భూమిని 50 మంది గిరిజన(ST) రైతులం కొన్నామని, అప్పటినుంచి నేటి వరకు ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని వెల్లడిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం దళితులు చేస్తున్న దౌర్జన్యానికి నిరసనగా గిరిజన రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దళిత రైతుల నుంచి 2010లో కొనుగోలు చేసిన భూములకు పట్టాలు వచ్చాయని, అందుకు ఆ భూములకు సంబంధించిన హక్కుదారులను మేమేనని నినాదాలు చేశారు.
ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు జారీ
ఈ చర్యలపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు. సొసైటీ(Society) రద్దయిన తర్వాత సొసైటీ భూముల్లో సాగు చేసుకుంటున్న మా గిరిజన రైతులను గుర్తించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP Govt) ప్రభుత్వం అసైన్డ్ పట్టాలను జారీ చేసిందన్నారు. అదేవిధంగా తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ పట్టాదారు పాసుబుక్కులు(Pass Books) వచ్చాయని వివరిస్తున్నారు. ఇంత కాలానికి కౌలుకు ఇచ్చాం మేము భూములు అమ్మలేదని అబద్ధాలు చెబుతూ మా జీవన ఉపాధికి భంగం కలిగించేటట్టు చర్యలకు పాల్పడుతున్న దళితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని గిరిజన రైతులైన మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: mlc kavitha: అనుమతి ఇవ్వకుంటే ఇంటి నుంచే దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత