MLA Mynampally Rohit: మాది పేదల ప్రభుత్వమని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా పాలన ప్రభుత్వంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్(MLA Mynampally Rohit Rao) అన్నారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మెదక్ పట్టణంలోని జికెఆర్ గార్డెన్స్ లో మెదక్ నియోజకవర్గంలోని 223మంది లబ్ధిదారులకు రూ 63లక్షల విలువ గల సిఎంఆర్ఎఫ్(CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు.
200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విదంగా ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలకు రైతు భరోసా, రుణమాఫీ అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మౌళిక వసతుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు తెచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మెదక్(Medak) ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి కష్ట సుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. రామాయంపేట పట్టణంలో రూ 200కోట్ల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు.
Allso Read: Nadikuda mandal: ఓట్లు ఒక చోట పనులు మరో చోట.. ధరి దాపు లేని ఊరు
ఏడుపాయల దుర్గ భవాని టెంపుల్
పదేండ్ల బిఆర్ఎస్(BRS) పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ(Telangana)లో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల దుర్గ భవాని టెంపుల్, ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చిల అభివృద్ధికి గత ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్(Chendhra Pall), కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy), కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy), శంకర్, బ్లాక్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, యూత్ కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు భరత్ గౌడ్, వివిధ నాయకులు పాల్గొన్నారు.
Also Read: Jr NTR: ఆ విషయంలో ఎన్టీఆర్ ను చూసి నేర్చుకుంటా.. హృతిక్
