Telangana Forest: ఆటవీశాఖ పోర్టల్ లోను నమోదు చేసింది. ఆ భూములకు రక్షణ చర్యలు చేపట్టాలని, నిత్యం పర్యవేక్షణ చేయాలని అటవీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటవీ పెంపునకు ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం సైతం చేపడుతుంది.ఈ ఏడాది అమ్మపేరుతో మొక్కనాటుదాం అనే కార్యక్రమాన్ని అటవీశాఖ చేపట్టింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో సుమారు 66లక్షల 64వేల 173 ఎకరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం దాదాపు అటవీశాఖ పోర్టల్ లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Amrabad Tiger Reserve Forest: ఫలించిన అటవీ శాఖ చర్యలు
5లక్షల 25వేల 99 ఎకరాలు
అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 17లక్షల 85వేల 317 ఎకరాలు ఉండగా, 17లక్షల 47వేల 970.574 ఎకరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నది. ఫారెస్టు ఎక్కువగా ఉన్న జిల్లా మాత్రం ములుగు జిల్లా. ఈ జిల్లాలో 10లక్షల 11వేల 224 ఎకరాలు ఉండగా 7లక్షల 26వేల 263 ఎకరాల్లో ఫారెస్టు ఉంది. 71.82శాతం భూమిలో అటవీ విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. అతి తక్కువగా కరీంనగర్ జిల్లాలో 5లక్షల 25వేల 99 ఎకరాలు ఉండగా కేవలం 785 ఎకరాల్లో మాత్రమే అటవీ విస్తరించి ఉంది. కేవలం 0.15శాతం భూమిలో మాత్రమే మొక్కలు ఉన్నాయి. అటవీశాతం పెంపునకు ప్రభుత్వం అటవీ పునరుజ్జీవన పథకాన్ని సైతం చేపడుతున్నారు. వనమహోత్సవం, ప్రకృతి వనాల పెంపు, ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమాలు చేపడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కొద్దిమేరకు అటవీశాతం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 24.05శాతం అటవీశాతం ఉన్నట్లు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి.
అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందనే ప్రచారం
అటవీ ప్రాంతాల్లో చెట్లను కొట్టకుండా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఫారెస్టు అడ్వయిజరీ కమిటీలు సైతం వేస్తూ చెట్ల పెంపకాన్ని చేపడుతున్నారు. అంతేగాకుండా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఫారెస్టు డెవలప్ మెంట్ ఏజెన్సీ, జాయింట్ ఫారెస్టు మేనేజ్ మెంట్ కమిటీలు వేస్తూ రక్షణ చర్యలు చేపడుతుంది. అన్ని శాఖల సహకారంతో అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందనే ప్రచారం చేస్తుంది. అటవీ భూములు అక్రమణలు కాకుండా కందకాలను తీసే కార్యక్రమాన్ని ప్రతీ ఏటా చేపడుతుంది. అందులో భాగంగానే అడవులను సంరక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు గాను జంగల్ బచావో జంగల్ బడావో అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అటవీ, రెవెన్యూ శాఖ లు సర్వే నిర్వహించి అటవీ భూములను నిర్దారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అడవులను సంరక్షించేందుకు ,అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవమారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ప్రాజెక్టుల ఆనకట్టలు, కాల్వల వెంట నాటేందుకు అవకాశం
తరచూ అటవీ, రెవెన్యూశాఖల మధ్య భూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే జాయింట్ సర్వే చేపట్టి భూ రికార్డుల ప్రకారం హద్దులు నిర్ధారించడంతో పాటు వాటి వివరాలను ఆన్ లైన్ లో పొందుపర్చాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం సర్వే చేస్తూ ఆ వివరాలను ఎప్పకటిప్పుడు వెబ్ సైట్లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిత్యం పర్యవేక్షణ చేసేందుకు సిబ్బందితో గస్తీ చేయిస్తున్నారు. మరోవైపు అటవీశాతం పెంపునకు ఇరిగేషన్ భూములు అనుకూలంగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టుల ఆనకట్టలు, కాల్వల వెంట నాటేందుకు అవకాశం ఉంది. కానీ ఇరిగేషన్ అధికారులు చొరవ తీసుకోకపోవడం, సరిగ్గా మానిటరింగ్ చేయకపోవడంతో కాల్వలకు ఇచ్చిన భూములు సైతం తిరిగి రైతులు సాగు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఫారెస్టు శాతం పెంపునకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కాల్వల వెంట మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపడితే అటవీ విస్తీర్ణం పెరుగుతుందని, భవిష్యత్ తరాలకు మేలుజరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Forest Department: అటవీ అధికారుల నిర్లక్ష్యం.. నిధుల్లో కేంద్రం కోత?
