Amrabad Tiger Reserve Forest (imagecredit:twitter)
తెలంగాణ

Amrabad Tiger Reserve Forest: ఫలించిన అటవీ శాఖ చర్యలు

Amrabad Tiger Reserve Forest: అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య పెరిగింది. 2023 – 24లో 33 పులులు ఉండగా 2024 – 25లో 36 పులులకు పెరిగాయి. ఈ మేరకు నేషనల్ టైగర్ కన్వర్వ్జేషన్ ఆథారిటీ వివరాలను సేకరించింది. 2024 డిసెంబర్ 20 నుంచి 2025 మే 15 వరకు 1594 కెమెరాలతో పులుల కదలికలను గుర్తించారు. పెద్ద పులులు 26 నుంచి 34కి పెరిగినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. పులుల పరిరక్షణ, అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చొరవ అంకిత భావానికి ఇది నిదర్శనమన్నారు. అమ్రాబాద్‌లో పులుల రక్షణకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటున్నదని, వాటి పునరావాసం కోసం కృషి చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

అధికారులు ప్రయత్నాలు ముమ్మరం
పులుల ఆవాస యోగ్యంగాఅటవీ ప్రాంతాలు ఉన్నాయా? అసలు పులులు ఎన్ని ఉన్నాయి. ప్రాంతంలో అయితే అవి స్థిరంగా ఉంటాయి ఆ ప్రాంతాలను త్వరలోనే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(NTCA) బృందం అధ్యయనం చేయనుంది. కవ్వాల్ లోకి పులులను తీసుకురావాలన్న లక్ష్యంతో ఆటవీశాఖ(Forest Department) అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర(Mharasta) నుంచి పులులు వస్తుండటంతో కవ్వాల్ లో రీ లోకేషన్ చేయాలని భావిస్తున్నారు. పులులను తీసుకెళ్లడానికి మహారాష్ట్ర ప్ఱభుత్వం కూడా అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లలో తెలంగాణ రోల్ మోడల్

పులుల సంచారానికి అనుకూలతలు
ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని తాడోబా అంధారి టైగర్ రిజర్వ్ (TATRT) నుంచి పులులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. కవ్వాల్ అటవీ ప్రాంతానికి పులులను తీసుకురావడమే ధ్యేయంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్'(Project Tiger) ప్రతిపాదనను మహారాష్ట్ర సర్కార్​నుంచి సానుకూల స్పందన లభించినట్లు ఫారెస్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టుపై త్వరలో నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (NTCA) బృందం కవ్వాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. కవ్వాల్ రిజర్వ్​ఫారెస్ట్ లో పులుల సంచారానికి అనుకూలతలు, ఆహారం, ఆవాస సామర్థ్యం, నీటి వసతి, పర్యావరణం, జన్యురీత్యా ఏర్పడే ప్రభావాలు తదితర అంశాలపై పరిశీలించనున్నట్లు తెలిసింది. ఎన్టీసీఏ ఇచ్చే నివేదిక ఆధారంగా పులులను ఇక్కడికి రీలోకేషన్​ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర తాడోబా నుంచి పులులు
గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కవ్వాల్ అభయారణ్యం 892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1,123.21 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాతో కలిపి మొత్తం 2,015.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. కవ్వాల్లో పులుల ఆహారానికి జింకలు, సాంబార్, నీల్​గాయి వంటి వన్యప్రాణులు ఉన్నాయి. కాగా, పొరుగున ఉన్న మహారాష్ట్ర తాడోబా నుంచి పులులు వస్తున్నాయి. మళ్లీ తిరిగి మహారాష్ట్రకు వెళ్తున్నాయి.

తాడోబా టైగర్ రిజర్వ్​లో 40 నుంచి 50 వరకు, ఇంద్రావతి నేషనల్ పార్కు(ndravati National Park)లో 20 నుంచి 35 వరకు పులులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అక్కడి నుంచి టైగర్స్​ను తెలంగాణకు(Telangana) తీసుకొచ్చేందుకు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలను మహారాష్ట్ర చీఫ్ వైల్డైఫ్ వార్డెన్ కు ప్రతిపాదనను గతంలో పంపించారు. మహారాష్ట్ర సర్కార్​సమ్మతి తెలిపినట్లు సమాచారం. పులుల రీలోకేషన్​​ చేసేందుకు​ అనుమతుల కోసం రాష్ట్ర అటవీశాఖ ఎన్టీసీఏకు లేఖ రాసింది. త్వరలోనే ఈ బృందం కవ్వాల్‌లో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Goshamahal: గోషామహల్‌లో రాజాసింగ్ వర్సెస్ మాధవీలత.. ఎవ్వరూ తగ్గట్లేదుగా!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!