Private Hospitals: ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని లక్ష్మి నర్సింగ్ హోం, జీవనజ్యోతి హాస్పిటల్, ఆయూష్ హాస్పిటల్, ఆరోగ్య హాస్పిటల్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. జిల్లాలో సిజేరియన్ ప్రసవాలు ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని సిజేరియన్ చేయాల్సిన పరీస్థితులు వున్నప్పుడు మాత్రమే సిజేరియన్ ప్రసవాలు చేయాలని నిబంధనలను ఉల్లగించి ఎవరైనా చేసినట్లైతే వారి రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.
ఆడ మగ అని తెలపడం చట్టరీత్యా నేరం
స్కానింగ్ సెంటర్ల లో ప్రతి నెల 5వ తేదీ లోపు ఫామ్ ఎఫ్ లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని, సరియైన విధంగా పూర్తిచేయాలని, అదేవిధంగా వాటిని ప్రతిరోజూ పి సి పి ఎన్ డి పి వెబ్సైట్లో ఆన్లైన్ చేయాల్సి ఉంటుందని, స్కానింగ్ సెంటర్లలలో లింగ నిర్ధారణ పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్ట్లు మాత్రమే గర్భవతులకు స్కానింగ్ చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆడ మగ అని తెలపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అన్ని స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ చేసే గదిలో, వేచియుండు హాలులో తప్పకుండా ఇక్కడ లింగ నిర్ధారణ చెప్పబడదు అనే బోర్డు పెట్టాల్సిందిగా ఆదేశించారు.
Also Read: MLA Palvai Harish Babu: ఆస్తుల విభేదాలతోనే కుటుంబంలో లుకలుకలు: ఎమ్మెల్యే హరీష్ బాబు
ఆసుపత్రులు మాత్రమే అబార్షన్ లు చేయాలి
నిబంధనలను అతిక్రమించిన వారిపై పిసిపి ఎన్డిటి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంటిపి చట్టం ప్రకారం నమోదు చేసుకున్న ఆసుపత్రులు మాత్రమే అబార్షన్ లు చేయాలని, నమోదు చేయని ఆసుపత్రుల లో గర్భవిచ్చితి చేసినట్లైతే ఎంటిపి చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ అత్యావసర సేవలకి సంబంధించిన ఫోన్ నంబర్స్ ని, వారు అంధించే సేవలకు తీసుకునే రుసుములకు సంబంధించిన దరల పట్టికను, ఆసుపత్రులలో పనిచెయు డాక్టర్ ల వివరాలు ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పిసిపిఎన్‌డిటి సర్టిఫికేట్ లను కూడా అందరికీ కనిపించే విదంగా ప్రదర్శించాలన్నారు. అలాగే ఫైర్ కు సంబంధించిన పరికరాలను అమర్చుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్ష ఉత్తీర్ణత చెందాలి
పనిచేసే సిబ్బంది యొక్క వివరాలను, వారి యొక్క అర్హత సర్టిఫికెట్ ల ను ఆసుపత్రులలో వుంచాలని, ఒకవేళ సిబ్బంధిని గాని డాక్టర్ లను కానీ మార్చినట్లఐతే, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి వివరాలు అందించాలని సూచించారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్స్ ను రెన్యూవల్ చేయించుకోవాలని పేరుకొన్నారు. విదేశాలలో ఎంబిబిఎస్ చదువుకొని వచ్చిన వారు భారత ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్ష ఉత్తీర్ణత చెందాలని, అంతేకాకుండా వారి డిగ్రీలు ఎంబిబిఎస్ కు మాత్రమే సమానమని ఎం.డి అని రాసుకోకూడధని తెలిపారు. ఒకవేళ ఎవరైనా అలా రాసి ప్రజలను తప్పుధోవ పట్టిస్తే వారిపైన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమం లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శశి జోష్ణ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం, నోడల్ అధికారి డాక్టర్ ప్రత్యూష, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ రాజు, హెచ్ ఈ ఓ లోక్య, అనిల్ పాల్గొన్నారు.
Also Read: Damodar Rajanarasimha: మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

