Seethakka (image cvredit: swetcha reporter or twitter)
Politics, నార్త్ తెలంగాణ

Seethakka: పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్.. సీతక్క కీలక వ్యాఖ్యలు

Seethakka: కాంగ్రెస్ పార్టీ దయతో తెలంగాణను సాధించుకొని పదేళ్లు పరిపాలన చేసి తెలంగాణ ఆస్తులను కుప్పలు తెప్పలుగా పంచుకొని దోచుకున్న దొంగల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) ధ్వజమెత్తారు.  కొత్తగూడా గంగారం మండలాల పర్యటనలో ఉన్న సీతక్క (Seethakka)) స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి చేసిన వ్యాఖ్యలకు సీతక్క( (Seethakka) మండిపడ్డారు.తెలంగాణను దోచుకొని జూటా పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని సీతక్క ఎద్దేవా చేశారు.

Also Read:Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువు.. ఎందుకో తెలుసా!

కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య

నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు ఇచ్చామని పేపర్ ప్రకటనలకు పరిమితమై ఆ తర్వాత పేపర్లను లీక్ చేస్తూ కోర్టులో కేసులు వేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నిలదీశారు. బాకీ కార్డు అంటే నువ్వు రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నా తల నరక్కుంట కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అన్న మాటలు, దళితులకే ముఖ్యమంత్రి ని చేస్తా, ప్రతి ఇంటికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తా, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తా, ఎస్సీ, ఎస్టీ లకు మూడెకరాల భూ పంపిణీ, రైతులకు యూరియా ఫ్రీగా ఇస్తా అని అనేక వాగ్దానాలు చేసి పదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులకు చేసి ఆస్తులు కుప్పలు తెప్పలుగా పెంచుకొని వాటాలు పంచుకునే కాడ చీలికలు వచ్చి పండుకుంటున్న మీ ఆలోచన ప్రజలందరికీ తెలుసు అని గుర్తు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు 

ప్రజలను డైవర్ట్ చేయడం కోసం బాకీ కార్డు అంటున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన అనేక వాగ్దానాలు కూడా రుణమాఫీ చేయలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క ఉపాధిని కూడా మీరు పెంచలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఓర్వలేకనే ఇలాంటి చవక బారు వ్యాఖ్యలు చేస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గమనించి కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.

ప్రజలు నేడు అధికారం కోల్పోయాక ప్రజలు గుర్తొచ్చారా? 

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి పల్లెలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనేనని, మంత్రి సీతక్కతోనే సాధ్యమవుతుందని భావించి కొత్తగూడెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని వివరించారు. ఉనికి చాటుకోవాలని ఉలిక్కి పడితే సరిపోదని తనదైన భాషలో బడే నాగజ్యోతికి చురకలు అంటించారు. అధికారంలో ఉన్నప్పుడు కానరాన్ని ప్రజలు నేడు అధికారం కోల్పోయాక ప్రజలు గుర్తొచ్చారా నీకు అంటూ నిలదీశారు. టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 70% అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం 30 శాతం కాలగర్భంలో కలిసిపోయే రోజులు వస్తాయని హెచ్చరించారు.

Also Read: Hrithik Roshan: ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా.. ‘వార్ 2’ రిజల్ట్‌పై హృతిక్ రోషన్ షాకింగ్ పోస్ట్!

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు